నా సామిరంగా.. మళ్ళీ ఏజ్ గ్యాప్ గోల?
సినీ ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలు తమకంటే చిన్న వయసులో ఉన్న హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది
By: Tupaki Desk | 4 Jan 2024 6:12 AM GMTసినీ ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలు తమకంటే చిన్న వయసులో ఉన్న హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. టాలీవుడ్ విషయానికొస్తే.. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున.. లాంటి సీనియర్ హీరోలకు వాళ్ల ఏజ్ కి తగ్గ హీరోయిన్లను వెతకడం దర్శక నిర్మాతలకు చాలా కష్టమైపోతోంది. అందుకే సీనియర్ హీరోలకు జోడిగా యంగ్ జనరేషన్ హీరోయిన్స్ ని సెలెక్ట్ చేస్తున్నారు.
ఇప్పుడున్న సోషల్ మీడియా కాలంలో ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. అందుకే సీనియర్ హీరోలు తమకంటే సగం వయసు ఉన్న హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకోవడంతో అది కాస్త ఆన్ లైన్ ట్రోలింగ్ కి దారితీస్తోంది. ఇప్పుడు సీనియర్ హీరో కింగ్ నాగార్జున విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఈ సంక్రాంతికి నాగార్జున 'నా సామిరంగా' అనే విలేజ్ బ్యాక్ డ్రాప్ మాస్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ మూవీలో నాగార్జున 35 సంవత్సరాల వయసున్న ఆషికా రంగనాథ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. వీరిద్దరి జోడి పై ఇప్పటికే సోషల్ మీడియాలో కొంత నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ ని చూసిన వాళ్లలో ఓ వర్గం ఆడియన్స్ నాగార్జున అశికా రంగనాథ్ జోడి ఏ మాత్రం సూట్ కాలేదని, హీరోయిన్ ఆషిక నాగార్జున పక్కన మరి చిన్నపిల్లలా కనిపిస్తుందని కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆమధ్య రవితేజ, శ్రీలీలా జోడి పై కూడా ఇలాంటి కామెంట్స్ వినిపించాయి. తండ్రి వయసులో ఉన్న రవితేజతో శ్రీ లీల నటించడం ఏంటంటూ ఈ జోడి పై కూడా చాలానే విమర్శలు వచ్చాయి. అలాంటి విమర్శలు వచ్చినప్పటికీ 'ధమాకా' బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ నిలిచింది. అంతేకాకుండా ప్రేక్షకుల ఆదరణ అలాంటి విమర్శలను డామినేట్ చేసింది. ఇందుకు కారణం ఈ సినిమాలో డైరెక్టర్ ఫ్రెష్ క్యారెక్టర్జేషన్ లతో పాటు ఆకట్టుకునే స్క్రీన్ ప్లేని రూపొందించాడు.
దాంతో ఆడియన్స్ రవితేజ, శ్రీ లీల మధ్య ఏజ్ డిఫరెన్స్ ని మర్చిపోయి బిగ్ స్క్రీన్ పై వాళ్ళ జోడిని చూసి ఎంతో ఆనందించారు. సో ఇప్పుడు 'నా సామిరంగా' సక్సెస్ నాగార్జున చేతిలో కాకుండా డైరెక్టర్ విజయ్ బిన్నీ చేతిలో ఉంది. సినిమాలో నాగార్జున ఆషిక రంగనాథ్ ల మధ్య భారీ ఏజ్ డిఫరెన్స్ ఉన్నా ఆడియన్స్ దాన్ని మర్చిపోయి సినిమాను ఎంజాయ్ చేయాలంటే డైరెక్టర్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో పాటు నాగార్జున, ఆశిక రంగనాథ్ ల మధ్య ఆకట్టుకునే క్యారెక్టరైజేషన్స్ ని ఆడియన్స్ కి అందించినట్లయితే ప్రేక్షకులు సినిమాని ఆదరించే అవకాశం ఉంది.