ఆ 20 మంది హీరోయిన్లలో కింగ్‌పై క్రష్ ఎవరికి?
టాలీవుడ్‌లో ఎప్పటికీ స్టైలిష్ రొమాంటిక్ హీరో ఎవరు? అంటే నాగార్జున గుర్తుకు వస్తారు
By: Tupaki Desk | 10 Jan 2024 4:51 PM GMTటాలీవుడ్‌లో ఎప్పటికీ స్టైలిష్ రొమాంటిక్ హీరో ఎవరు? అంటే నాగార్జున గుర్తుకు వస్తారు. ఇప్పుడు మరోసారి నా సామిరంగా ప్రచార వేదికపై ఇది నిరూపణ అయింది. మొత్తం 20 మంది హీరోయిన్లు కింగ్ నాగార్జున గురించి, ఆయన స్టైల్ రొమాంటిక్ యాటిట్యూడ్ గురించి 'నా సామి రంగా' ప్రీరిలీజ్ వేదికలో ఏవీ(యాంకర్ విజువల్)లో మాట్లాడారు. అయితే ఇంతమంది హీరోయిన్లలో నాగార్జున అంటే ఫస్ట్ క్రష్ అంటూ ఎగ్జయిట్ చేసిన కథానాయిక ఎవరు? అంటే వివరాల్లోకి వెళ్లాలి.
కింగ్ నాగార్జున నటించిన నా సామి రంగ జనవరి 14న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. నిన్న విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ గ్రామీణ యాక్షన్ డ్రామాకి విజయ్ బిన్ని దర్శకత్వం వహించారు. నాగార్జున నటించిన ఈ చిత్రం డిజిటల్, శాటిలైట్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ - స్టార్ మా కైవసం చేసుకున్నట్లు తాజా సమాచారం.
నేటి రాత్రి హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఎమోషనల్ స్పీచెస్ ఆద్యంతం ఆకట్టుకున్నాయి. అయితే ఇందులో కింగ్ నాగార్జున కెరీర్ జర్నీ, స్టైల్ కంటెంట్ ని ఎలివేట్ చేసే ఏవీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో నాగ్ సరసన రొమాన్స్ చేసిన చాలా మంది హీరోయిన్లు అతడిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ ఏవీలో రమ్యకృష్ణ, అనుష్క, కాజల్ అగర్వాల్ సహా దాదాపు 20 మంది కథానాయికల ఫీలింగ్ ని ఆవిష్కరించగా, నాగ్ సర్ అంటే తనకు ఫస్ట్ క్రష్ అంటూ కాజల్ తన ఎగ్జయిట్ మెంట్ ని చాటుకున్న తీరు ఆకర్షించింది. నిజానికి నాగార్జున సరసన ఘోస్ట్ చిత్రంలో కాజల్ అగర్వాల్ నటించాల్సింది. కానీ అనూహ్యంగా తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని కాజల్ పళ్లాడి లైఫ్ లో సెటిలైంది. దీంతో అప్పటికి సెట్స్ పై ఉన్న సినిమాల నుంచి వైదొలగింది. ఘోస్ట్ లో అలా ఛాన్స్ మిస్సయింది.
ఇక ఇదే ప్రీరిలీజ్ వేదికపై రణబీర్ కపూర్ (బ్రహ్మాస్త్ర కోస్టార్), కె.రాఘవేంద్రరావు, అలీ, బ్రహ్మానందం సహా ఎందరో ప్రముఖులు నాగార్జున గొప్పతనం గురించి వ్యాఖ్యానించిన ఏవీ గొప్ప హైలైట్ అయింది. ప్రయోగాలు చేయాలంటే నాగార్జున తర్వాతే అంటూ మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించిన ఏవీ కింగ్ లోని గొప్పతనాన్ని ప్రత్యేకంగా ఎలివేట్ చేసింది. కాంపిటీషన్ లో ఎందరు హీరోలు ఉన్నా కానీ, నాగార్జున ఎప్పటికీ కింగ్ అనడానికి ఈ వేదిక సరిపోతుంది.
'నా సామి రంగా' ఈవెంట్‌లో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, మర్నా మీనన్, రుక్సార్ ధిల్లాన్ తదితరులు పాల్గన్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చారు. నా సామి రంగ మలయాళ బ్లాక్ బస్టర్ 'పోరింజు మరియం జోస్' ఆధారంగా రూపొందింది.