సంక్రాంతి సినిమాల థియేటర్ల ఇష్యూ.. నాగ్ ఏమన్నారంటే?
ఈ మూవీలో నాగార్జున సరసన కన్నడ భామ ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది
By: Tupaki Desk | 12 Jan 2024 4:02 PM GMTకింగ్ నాగార్జున హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ నా సామి రంగ. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మూవీ.. ప్రమోషనల్ కంటెంట్‌తో అందరినీ ఆకట్టుకుని ఇప్పటికే హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అందించిన పాటలు చార్ట్ బస్టర్‌గా అలరిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుందీ సినిమా.
ఈ మూవీలో నాగార్జున సరసన కన్నడ భామ ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే వీరిద్దరి కెమిస్ట్రీ అదిరిపోయిందని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే పాటలో ఇద్దరూ ఎక్స్ ప్రెషన్స్ తో దంచేశారని అంటున్నారు. మరో రెండు రోజుల్లో సినిమా విడుదల కానున్న సందర్భంగా నాగార్జున... విలేకరులతో ముచ్చటించారు. సంక్రాంతి సినిమాల థియేటర్ల సమస్యపై మాట్లాడారు.
"నేను నటించిన బంగార్రాజు సినిమా కొవిడ్ టైమ్ లో రిలీజ్ అయింది. కాబట్టి అప్పుడు ఎలాంటి థియేటర్ల సమస్యలు లేవు. ఆ తర్వాత అదే పండుగకు విడుదలైన సోగ్గాడే చిన్ని నాయనా మూవీకి థియేటర్ల షేరింగ్ లో సమస్యలు వచ్చాయి. దీంతో 300 థియేటర్లలో మాత్రమే విడుదలైంది ఆ చిత్రం. ఇప్పుడు నా సామి రంగ సినిమాకు కూడా అదే సమస్య వచ్చింది. అందుకే ఈ సారి కూడా 300 థియేటర్లతోనే రంగంలో దిగుతున్నాం" అని నాగార్జునకు చెప్పారు.
ఇక సంక్రాంతికే నా సామి రంగ సినిమాను ఎందుకు విఢుదల చేస్తున్నారన్న ప్రశ్నకు కూడా నాగార్జున బదులిచ్చారు. "సంక్రాంతి పండుగ చుట్టూ నా సామి రంగ మూవీ కంటెంట్ తిరుగుతుంది. కాబట్టి మూవీనే పెద్ద పండుగకే విడుదల చేయాలి. అంతకన్నా మరో మార్గం లేదు" అని నాగార్జున తెలిపారు. ఏది ఏమైనప్పటికీ.. తమ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుద్దని నాగార్జున పక్కాగా చెబుతున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. మలయాళం పోరంజు మరియం జోస్ మూవీకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. కానీ నేటివెటీకి తగ్గట్లు మార్పులు చేసి బెజవాడ ప్రసన్నకుమార్ కథ అందించారు. టాలీవుడ్ ప్రముఖ బ్యానర్ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మించారు. పవన్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పించారు. మరి డెబ్యూ మూవీతో విజయ్ బిన్నీ, సంక్రాంతి సెంటిమెంట్ తో నాగార్జున హిట్ కొడతారో లేదో చూడాలి.