చదువులేని ఏఎన్నార్ నోట ఇంగ్లీష్ ఎలా?
బాల్యంలో ఇల్లు...ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ తప్ప ఆయనకేం తెలియదు అన్న సంగతి తాజాగా వెలుగులోకి వస్తోంది.
By: Tupaki Desk | 27 March 2024 11:09 AM GMTమొదటితరం కథానాయకుడు..టాలీవుడ్ లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గురించి తెలిసిందే. ఏడు దశాబ్ధాల పాటు తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన ఓ లెజెండ్ ఆయన. 1940 నుంచి 2014 వరకూ నటుడిగా పరిశ్రమకు సేవలందిస్తూనే ఉన్నారు. చిత్ర పరిశ్రమకి చిన్న వయసులోనే రావడంతో అంతకాలం పనిచేయగలిగారు. మరి ఆయన ఏం చదువుకున్నారు? ఆయన విద్యాబ్యాసం ఎక్కడ? అంటే ఏఎన్నార్ గురించి చాలా ఆసక్తికర సంగతులే తెలుస్తున్నాయి. నాగేశ్వరరావు తన జీవితంలో ఏనాడు స్కూల్ వైపు వెళ్లిందే లేదు. అక్షరాలు దిద్దింది లేదు. బాల్యంలో ఇల్లు...ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ తప్ప ఆయనకేం తెలియదు అన్న సంగతి తాజాగా వెలుగులోకి వస్తోంది.
చిన్నప్పుడు తల్లికి.. ఇతరులకు సహాయంగా ఉంటూ.. నాటకాలు వేసుకుంటూ తిరేగవారుట. అయినా సరే ఏఎన్నార్ అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడగలరు. అవును ఆయన ఏబీసీడీలు దిద్దకపోయినా ఇంగ్లీష్ ని చెడుగుడు ఆడుకున్న సందర్భాలున్నాయి. ఏకంగా అగ్ర రాజ్యం ఆమెరికాలోనే తన ఇంగ్లీష్ తో అక్కడి పౌరులతో చప్పట్లు కొట్టించుకున్న గ్రేట్ స్పోక్ పర్సన్ గా నిలిచారు. ఆ సంగతేంటో ఓ సందర్భంలో ఏఎన్నార్ వివరించారు. `అప్పట్లో చిత్ర పరిశ్రమలో అగ్ర నటీనటులకి విదేశాలకి రమ్మని ఆహ్వానాలు వచ్చేవి. రెండు దేశాల సంస్కృతి సంప్రదాయాలు ఎలా వున్నాయి? వాటి వ్యత్యాసాలు ఏంటి? అని తెలుసుకోవడం కోసం ప్రభుత్వాలు ఆహ్వానించేవి.
సెలబ్రిటీల ద్వారా చెప్పిస్తే అలాంటి విషయాలు జనాల్లోకి బలంగా వెళ్తాయని వాళ్ల నోట చెప్పించేవారు. అలా 1964లో ఏఎన్నార్ కి అమెరికా ప్రభుత్వం నుండి ఆహ్వానం వచ్చింది. థియేటర్..టీవీ..నాటకాల గురించి ఓ యూనివర్శిటీలో ఇంగ్లీష్ లో మాట్లాడాలి. నాకు ట్రాన్సలేటర్న్ కూడా ఇచ్చారు. కానీ నాకే ఎందుకనో ఇంగ్లీష్ లోనే చెప్పాలనిపించింది. ముందుగానే నేనే నాకు భాష సరిగ్గా రాదు అని చెప్పేసాను. తప్పులుంటే క్షమించండి..నాభావాల్ని అర్దం చేసుకోండని చెప్పాను.
అప్పటికే కొన్ని చోట్టు చిన్నగా మాట్లాడం తెలియడంతో నాకు తెలిసిన ఇంగ్లీష్... ఆ యూనివర్శిటీ వెళ్లిన తర్వాత నేర్చుకున్న కాసేపు ఇంగ్లీష్ తో ఏదో మాట్లాడాను. నేను మాట్లాడటం పూర్తయిన తర్వాత అంతా చప్పట్లు కొట్టి...బాగా మాట్లాడావు అని అన్నారు. ఎక్కువగా ఇంగ్లీష్ లో మాట్లాడం అదే మొదటిసారి` అని అన్నారు.