పెద్ద హీరోని ఏలిన్నాటి శని వదలదు
ఒక్కోసారి ఏలిన్నాటి శని వెంటాడుంది. దీని ప్రభావంతో వరుస పెట్టి పరాజయాలు ఎదురవుతాయి.
By: Tupaki Desk | 13 Dec 2024 3:32 AM GMTఒక్కోసారి ఏలిన్నాటి శని వెంటాడుంది. దీని ప్రభావంతో వరుస పెట్టి పరాజయాలు ఎదురవుతాయి. కొందరు ఒకదాని వెంట ఒకటిగా కుటుంబ సమస్యలు, చిక్కుల్ని ఎదుర్కొంటారు. అనారోగ్యాలు, కుళ్లు కుతంత్రాలు ఎదురవుతాయి కొందరికి. ఇటీవలి కాలంలో అక్షయ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దానిని బట్టి అతడు పైవన్నీ ఎదుర్కొన్నాడు. అతడిని బ్యాడ్ టైమ్ వెంటాడింది. పరిశ్రమలో కొన్ని కుట్రల్ని కూడా ఎదుర్కొని నిలబడ్డాడు.
అదంతా అటుంచితే తన సినిమా విడుదలవుతోంది అనగానే కొందరు గూడుపుటానీ చేసి నెగెటివ్ ప్రచారం చేయడం ప్రారంభించారని కూడా అక్కీ పబ్లిగ్గా వాపోయాడు. దాని ఫలితం బాక్సాఫీస్ వద్ద తీవ్ర ప్రభావం చూపిందని అన్నాడు. అదంతా అటుంచితే అతడు చాలా కాలంగా అన్నిటి నుంచి బయటపడి పెద్ద హిట్టందుకోవాలని కలలుగంటున్నాడు. ఈ కల తదుపరి చిత్రం స్కై ఫోర్స్ తో నెరవేరుతుందని కూడా భావిస్తున్నాడు.
ఈ సినిమా కథాంశం దేశభక్తి నేపథ్యంలో సాగుతుంది గనుక కచ్ఛితంగా ఆడియెన్ కి ఎక్కే ఎలిమెంట్ తో అక్షయ్ వస్తున్నాడని భావించాలి. ఎంచుకున్న కాన్సెప్టుకు తగ్గట్టే ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న విడుదల కానుంది. తాజా సమాచారం ప్రకారం అక్షయ్, నిమ్రత్ కౌర్, వీర్ పహారియా వచ్చే వారంలో ప్రమోషనల్ సాంగ్ చిత్రీకరణలో పాల్గొంటారని తెలిసింది. మొత్తం పాటను నాలుగు రోజుల పాటు ముస్సోరిలో చిత్రీకరించనున్నారు. ఈ పాట చాలా కీలకమైనది. ఈ చిత్రంలో మరో టాప్ స్టార్ కూడా నటిస్తున్నారని గుసగుస ఉంది. ఈ చిత్రాన్ని మడాక్ ఫిలింస్ దినేష్ విజన్ నిర్మించారు. దీంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మరోవైపు అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో కేవలం 30 ని.లు మాత్రమే కనిపిస్తారని కూడా ప్రచారం ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే సినిమా హిట్టు కొట్టినా క్రెడిట్ అక్కీ ఖాతాలో పడకుండా ఇతరులకు డైవర్ట్ అవుతుందనే ఆందోళన కూడా వ్యక్తమైంది. అందుకే అక్షయ్ కి స్కైఫోర్స్ చాలా కీలకమైనది. ఈ సినిమాలో పూర్తి నిడివి పాత్రలో అక్షయ్ కుమార్ తన అభిమానులకు అద్భుతమైన ట్రీట్ ఇస్తాడని, చాలా కాలంగా వేచి చూస్తున్న సక్సెస్ దక్కాలని భావిద్దాం.