Begin typing your search above and press return to search.

తల్లి అయిన దాస్‌ కా హీరోయిన్‌

తెలుగు ప్రేక్షకులను దాస్ కా దమ్కీ, మన్మథుడు 2, హరోం హర, ది వారియర్‌ సినిమాలతో పలకరించిన ముద్దుగుమ్మ అక్షర గౌడ.

By:  Tupaki Desk   |   7 Dec 2024 9:38 AM GMT
తల్లి అయిన దాస్‌ కా హీరోయిన్‌
X

తెలుగు ప్రేక్షకులను దాస్ కా దమ్కీ, మన్మథుడు 2, హరోం హర, ది వారియర్‌ సినిమాలతో పలకరించిన ముద్దుగుమ్మ అక్షర గౌడ. ఈ కన్నడ బ్యూటీ తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. కమర్షియల్‌గా ఒకటి రెండు హిట్స్ పడి ఉంటే కచ్చితంగా ఈ అమ్మడి క్రేజ్‌, కెరీర్‌ మరోలా ఉండేది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా తాను తల్లిని అయినట్లుగా ప్రకటించింది. అంతే కాకుండా తన బిడ్డ ఫోటోను షేర్‌ చేయడం ద్వారా తన సంతోషాన్ని తన ఫాలోవర్స్‌తో పంచుకుని తన ప్రెగ్నెంట్‌ సమసయం ఎలా గడిచింది అనే విషయాలను షేర్‌ చేసుకోవడం జరిగింది.

2011లో సినిమా ఇండస్ట్రీలో అక్షర గౌడ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. చాలా తక్కువ సమయంలోనే నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. సొంత భాష కన్నడంలో మాత్రం ఈ అమ్మడికి 2018 వరకు వెయిట్‌ చేయాల్సి వచ్చింది. తమిళ్‌, హిందీ సినిమాల్లో మంచి గుర్తింపు రావడంతో అక్కడే సినిమాలు చేస్తూ వచ్చింది. కన్నడంలో ఈమె చేసిన సినిమాలు కొన్నే అయినా అక్కడ కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. మొత్తానికి సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని కొత్త జీవితంను అక్షర గౌడ ప్రారంభించింది.

పెళ్లి తర్వాత కూడా ఆ సినిమాల్లో నటించింది. విశేషం ఏంటంటే ఈ ఏడాది కూడా అక్షర నటించిన సినిమా విడుదల అయ్యింది. అంటే గర్భవతిగా ఉన్న సమయంలో అక్షర గౌడ ఆ సినిమాలో నటించి ఉంటుంది. పెళ్లి, పిల్లల తర్వాత సినిమా ఇండస్ట్రీలో కొనసాగడం ఈ మధ్య కాలంలో చాలా కామన్‌గా కనిపిస్తుంది. కనుక అక్షర గౌడ సైతం మళ్లీ సినిమాలతో బిజీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా ఆమె కన్నడంతో పాటు ఇతర భాషల్లోనూ సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇంతకు ముందు బేబీ బంప్‌ ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలిచిన అక్షర గౌడ ఇప్పుడు తన బేబీతో ఉన్న ఫోటోను షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది. అక్షర బేబీ ఫోటోను షేర్‌ చేయడంతో ఆమె ఫ్యాన్స్‌ అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. త్వరలో మిమ్ములను మళ్లీ వెండి తెరపై చూడటం కోసం ఎదురు చూస్తున్నాం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో అక్షర జర్నీ ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి.