Begin typing your search above and press return to search.

ఆ డైరెక్ట‌ర్ మాట‌కు క‌ట్టుబ‌డే 'క‌న్న‌ప్ప‌'లో కిలాడీ!

మోహ‌న్ లాల్, మోహ‌న్ బాబు, ప్ర‌భాస్ ..అక్ష‌య్ కుమార్ లాంటి స్టార్ హీరోలు కూడా క‌న్న‌ప్ప‌లో భాగ‌మ‌య్యారు.

By:  Tupaki Desk   |   13 Feb 2025 9:30 PM GMT
ఆ డైరెక్ట‌ర్ మాట‌కు క‌ట్టుబ‌డే క‌న్న‌ప్ప‌లో కిలాడీ!
X

మంచు విష్ణు క‌థానాయకుడిగా న‌టిస్తోన్న 'క‌న్న‌ప్ప' భారీ కాన్వాస్ పై తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. మోహ‌న్ బాబు ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోన్న చిత్ర‌మిది. దాదాపు 200 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇంత వర‌కూ ఈ రేంజ్ బ‌డ్జెట్ లో మోహ‌న్ బాబు సినిమా నిర్మించింది లేదు. తొలిసారి క‌న్న‌ప్ప కోస‌మే అంత‌గా ఖ‌ర్చు చేస్తున్నారు. మోహ‌న్ లాల్, మోహ‌న్ బాబు, ప్ర‌భాస్ ..అక్ష‌య్ కుమార్ లాంటి స్టార్ హీరోలు కూడా క‌న్న‌ప్ప‌లో భాగ‌మ‌య్యారు.

శివుడి పాత్ర‌లో అక్ష‌య్ కుమార్ క‌నిపిస్తారు. అయితే ఈ సినిమాలో న‌టించ‌డానికి అక్ష‌య్ కుమార్ తొలుత నో చెప్పిన విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. స్వ‌యంగా ఆ విష‌యాన్ని విష్ణు రివీల్ చేసాడు. ఈ సినిమా క‌థ చెప్ప‌డానికి వెళ్లినప్పుడు న‌టించ‌న‌ని చెప్పారుట‌. ఒక‌సారి కాదు..రెండు సార్లు అక్ష‌య్ నోట నో అనే మాట త‌ప్ప ఎస్ అనే మాట రాలేదుట‌. ఆ త‌ర్వాత ఓ బాలీవుడ్ డైరెక్ట‌ర్ సూచ‌న‌తో అక్ష‌య్ శివుడి పాత్ర‌లో న‌టించ‌డానికి అంగీక‌రించార‌ని విష్ణు తెలిపాడు.

మ‌రి అక్ష‌య్ విష్ణు అడిగితే ఎందుకు నో చెప్పాడు? బాలీవుడ్ డైరెక్ట‌ర్ చెప్ప‌గానే ఒప్పుకోవ‌డానికి గ‌ల కార‌ణాలు ? ఏంటి అన్న‌ది మాత్రం విష్ణు బ‌య‌ట పెట్ట‌లేదు. ఈ తరం ప్రేక్షకులకు శివుడిగా అక్షయ్ కుమార్‌నే చూపించాల‌ని విష్ణు భావించాడుట‌. అందుకే ప‌ట్టు వ‌ద‌లకుండా అక్ష‌య్ కోసం ప్ర‌య‌త్నించి స‌క్సెస్ అయ్యాం అన్నాడు. మ‌రి శివుడి పాత్ర‌లో అక్ష‌య్ విశ్వ‌రూపం ఎలా ఉంటుందో చూడాలి. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది.

ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అన్ని ప‌నులు పూర్తి చేసి చిత్రాన్ని ఏప్రిల్ 25న గ్రాండ్ రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే విష్ణు శివ‌భ‌క్తుడిగా న‌టించిన పాత్రకు సంబంధించిన పాట ఒక‌టి వైర‌ల్ అవుతుంది.