అసలే ప్లాపుల్లో ఆహీరో...మధ్యలో ఇదో సమస్యా?
కిలాడీ అక్షయ్ కుమార్ ఓవైపు ఆన్ సెట్స్ లో బిజీగా ఉంటూనే కొత్త చిత్రాల జోరు కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 21 Oct 2024 2:50 AM GMTకిలాడీ అక్షయ్ కుమార్ ఓవైపు ఆన్ సెట్స్ లో బిజీగా ఉంటూనే కొత్త చిత్రాల జోరు కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. కథ నచ్చితే ఒకే చేయడం డేట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన న్యాయవాది సి. శంకరన్ నాయర్ బయోపిక్ ని లాక్ చేసారు. రఘు పాలట్ - పుష్పా పాలత్ రచించిన `ది కేస్ దట్ షేక్ ది ఎంపైర్` పుస్తకం ఆధారంగా కరణ్ సింగ్ త్యాగీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే మార్చి 14న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడీ తేది విషయంలో కరణ్ జోహార్ పునరాలోచించమని అక్షయ్ ని కోరినట్లు సమాచారం. అందుకు ఓ ప్రత్యేక కారణం ఉంది. అక్షయ్ కుమార్ నటిస్తోన్న మరో చిత్రం `జాలీ ఎల్ ఎల్ బీ-3` ఏప్రిల్ లో రిలీజ్ అవుతుంది. ఈ రెండు సినిమాలు న్యాయవాది వృత్తిని బేస్ చేసుకుని తెరకెక్కిస్తున్న చిత్రాలే.
ఈ నేపథ్యంలో కరణ్ జాలీ ఎల్ ఎల్ బీ3 సినిమా విషయంలో పునరాలోచన కోరినట్లు తెలుస్తోంది. రెండు సినిమాల మధ్య 20 రోజులు గ్యాప్ ఉన్నా? కంటెంట్ రిలేటడ్ గా ఉండటంతో ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉంటుంది? అన్న సందేహంలోనే కరణ్ ఈ ప్రపోజల్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే జాలీ ఎల్‌ఎల్‌బి 3 నిర్మాతలు దీనిపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఒకవేళ అక్షయ్ కుమార్ అంగీకరించినా నిర్మాతలు అందుకు ఒప్పుకుంటారా? అన్నది మరో సందేహం.
ఎందుకంటే తొలుత జాలీ ఎల్ ఎల్ 3 రిలీజ్ తేదిని లాక్ చేసుకుంది. వెనకొస్తున్న నాయర్ చిత్రాన్ని తమ సినిమా కోసం వాయిదా వేసుకోవడం అన్నది ఎంత వరకూ సమంజసం అన్నది కూడా ఆలోచిస్తారు. ఏది ఏమైనా ఈ రెండు సినిమా రిలీజ్ ల మధ్య అక్షయ్ కుమార్ నలిగిపోవడం తప్పదు. ఇప్పటికే ఆయన వరుస ప్లాప్ లతో సతమత మవుతున్నాడు. కొత్తగా ఈ సమస్యను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఆయన నెత్తిన పడేలా ఉంది.