స్టార్ హీరో ఫ్లాపుల కారణంగా ఇల్లు అమ్మాడా?
కానీ ఒక్కో సినిమాకు రూ.80 కోట్ల పారితోషికంతో దేశంలోని అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోల్లో ఒకడిగా నిలిచాడు.
By: Tupaki Desk | 13 March 2025 4:00 AM ISTపాపులర్ స్టార్ హీరో నటించిన భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా డిజాస్టర్లుగా మారాయి. గడిచిన రెండేళ్లుగా సరైన బ్లాక్ బస్టర్ ఒక్కటి కూడా లేదు. కానీ ఒక్కో సినిమాకు రూ.80 కోట్ల పారితోషికంతో దేశంలోని అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోల్లో ఒకడిగా నిలిచాడు. కానీ ఇటీవలి ఫ్లాపులు అతడిని కలవరపెట్టాయి. మార్కెట్లో తన డిమాండ్‌ను తగ్గించాయి. మునుముందు పరిస్థితి తలకిందులయ్యే ప్రమాదం పొంచి ఉంది.
ఇలాంటి సమయంలో అతడు డ్యామేజ్ కంట్రోల్ కోసం ప్రయత్నించాడు. దీనికోసం తన సినిమాల టికెట్లు తానే కొనుక్కున్నాడని, కార్పొరెట్ బుకింగులు చేసాడని అప్పట్లో చాలా ట్రోలింగ్ సాగింది. అయితే ఇలాంటి అడ్డగోలు బుకింగుల కారణంగా అతడు తన సొమ్ముల్ని కోల్పోవాల్సి వస్తోందని ఇప్పుడు విశ్లేషిస్తున్నారు.
అతడు బ్యాక్ టు బ్యాక్ రెండు నెలల్లో తన రెండు అపార్ట్ మెంట్లను అమ్మేసాడు. ఉన్నట్టుండి తన సొంత ప్రాపర్టీని అమ్మకానికి పెట్టేయడంతో అది చాలా మందిలో సందేహాలను రేకెత్తించింది. తన సినిమాలు ఫ్లాపులవ్వడంతో వచ్చిన నష్టాలను ఫుల్ ఫిల్ చేసేందుకు అతడు ఇలా చేస్తున్నాడని ఊహిస్తున్నారు. అయితే ఇది నిజమా? అంటే... ఒక సెక్షన్ అభిమానులు దీనిని వేరొకలా విశ్లేషిస్తున్నారు. అతడు రెండు ఫ్లాట్‌లను కేవలం 2.5 కోట్లకు కొనుగోలు చేసి ఇప్పుడు ఒక్కో ఫ్లాట్ ని ఏకంగా 4.35 కోట్లకు అమ్మారు. 84 శాతం లాభాలను అతడు అందుకున్నాడు. ఇది నిజంగా ఆసక్తిని కలిగిస్తోంది. రియల్ వెంచర్లలో పెట్టుబడులు పెట్టడం భారీ లాభాలను ఆర్జించడంలో బాలీవుడ్ స్టార్లు అమితాబ్, అభిషేక్ ఎప్పుడూ ముందున్నారు. ఇప్పుడు అక్షయ్ కూడా వారితో జాబితాలో చేరాడు.
కానీ అక్షయ్ తన సినిమాలు ఫ్లాప్ కావడంతో తన ఇంటిని అమ్మాల్సి వచ్చిందని సోషల్ మీడియాల్లో జోకులు వేసిన వారికి అర్థం కావాల్సింది చాలా ఉంది. రియల్ ఎస్టేట్ అనేది లాభాల కోసం ఆడే ఆట. లాభం కోసం అమ్మడం ఎలా? అన్నదే ముఖ్యం ఇక్కడ. 1000 కోట్లు పైగా నికర ఆస్తులు ఉన్న అక్షయ్ కుమార్ గురించే ఈ స్టోరి అంతా. అతడు తన వ్యాపారాలను ఎలా అభివృద్ధి చేయాలో తెలిసినవాడు. అతడు రియల్ ఎస్టేట్ తో ఆడుతున్నాడు. ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ తో ఇన్నాళ్లు కోల్పోయిన పేరును కూడా తిరిగి వెనక్కి లాక్కొస్తాడు!