ప్రయోగాలు చేస్తున్నా గుర్తింపు కరువాయో!
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కెరీర్ అత్యంత బ్యాడ్ ఫేజ్ లో నడుస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 10 Sep 2024 7:18 AM GMTబాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కెరీర్ అత్యంత బ్యాడ్ ఫేజ్ లో నడుస్తోన్న సంగతి తెలిసిందే. వరుస పరాజయాలతో అక్షయ్ ఎంతో ఒత్తిడిని ఎదుర్కుంటున్నాడు. చేసుకోవడానికి చేతిలో సినిమాలున్నా? పరాజయాల్ని అతన్ని వెన్నెంటే వెంటాడుతున్నాయి. అపజయాల్ని జయాలతో బ్యాలెన్స్ చేయాలని ఎంత ప్రయత్నించినా? అవి విఫలం తప్ప సఫలం దిశగా అడుగులు పడటం లేదు.
దెబ్బ మీద దెబ్బ అన్నట్లు అతడి చిత్రాలు ప్లాప్ ల్లో కూడా ఒకటికొకటి పోటీ పడుతున్నాయి. ఆ సినిమాల కోసం అక్షయ్ ఎంతగానే శ్రమిస్తున్నాడు. ప్రత్యేకంగా యాక్షన్ సన్నివేశాల కోసం 60 ఏళ్లకు రీచ్ అయినా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వాటి కోసం ప్రత్యేకంగా సన్నధం అవుతోన్న విధానం...ఆన్ సెట్స్ లో వాటిని ఎగ్జిక్యూట్ చేయడం వరకూ ఎంతో కష్టపడుతున్నాడు. ఇక అక్షయ్ అంటే హాలీవుడ్ యాక్షన్ స్టార్ ఇమేజ్ ఉండనే ఉంది.
వాళ్లకి ఏమాత్రం తగ్గకుండా యాక్షన్ సన్నివేశాల కోసం నిరంతరం ప్రయత్నిస్తుంటాడు. బైక్ పై రేసింగ్ సన్నివేశాలు..ఛేజింగ్ సన్నివేశాలు...కారుపై యాక్షన్ సన్నివేశాలు..గాల్లో ఎగిరెగిరి తన్నడాలు.. భంగీ జంప్ లాంటి సన్నివేశాలు ఇలా ఒకటేంటి? అక్షయ్ చేయని స్టంట్ అంటూ ఉండదని ఇప్పటికే ప్రూవ్ చేసాడు. ఇటీవల రిలీజ్ అయిన `బడే మియాన్ చోటే మియాన్` సినిమాలో అక్షయ్ యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజ్ లో అలరించాయో తెలిసిందే.
ఇలా యాక్షన్ కంటెంట్ సినిమా అయితే హాలీవుడ్ స్టార్లకు ఏమాత్రం తగ్గకుండా నటిస్తాడు. అందుకే అతడికి ఇండియన్ టామ్ క్రూజ్ గానూపేరుంది. కానీ ఎంత కష్టపడినా ఏం లాభం. కష్టే పలి అన్న నానుడి అక్షయ్ విషయంలో కేవలం మాటగానే మిగిలిపోతుంది. అతడి యాక్షన్ కష్టానికి తగ్గ ఫలితం మాత్రం దక్కడం లేదు. అయినా ఏదో ఒకరోజు వాటిలోనూ తానో బ్రాండ్ అని ప్రూవ్ చేయాలని ఆశిద్దాం.