హీరో పారితోషికంలో అంత గోప్యత దేనికో?
మరి ఇంత బిజీగా ఉండే హీరో పారితోషికం ఎంత తీసుకుంటాడు? అంటే సరైన సమాధా నం మాత్రం కిలాడీ నుంచి రావడం లేదు.
By: Tupaki Desk | 21 Jan 2025 12:30 AM GMTబాలీవుడ్ నటుడు ఏడాదిలో అత్యధికంగా సినిమాలు చేసే హీరో ఎవరు అంటే కిలాడీ అక్షయ్ కుమార్ పేరే చెబు తారంతా. ఏడాదిలో కనీసం నాలుగైదు సినిమాలైనా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అతడికే చెల్లింది. 2025 క్యాలెండ్ 2024 లోనే ఫిల్ అయింది. 2026 లో రిలీజ్ అయ్యే కొన్ని సినిమాలు ఇప్పటికే రిలీజ్ తేదీల్ని కూడా కన్పమ్ చేసుకున్నాయి. మరి ఇంత బిజీగా ఉండే హీరో పారితోషికం ఎంత తీసుకుంటాడు? అంటే సరైన సమాధా నం మాత్రం కిలాడీ నుంచి రావడం లేదు.
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ 135 కోట్లు పారితోషికం తీసుకుంటారు? అనే ప్రచారం జరిగింది. కానీ ఈ ప్రచారం నమ్మాలా? వద్దా? అన్నది ప్రేక్షకుల ఇష్టానికే వదిలేయాలి. ఎందుకంటే అక్షయ్ నటించిన సినిమాలన్నీ కొంత కాలంగా డిజాస్టర్లే కనిపిస్తున్నాయి. వరుస పరాజయాలతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి సైతం గురయ్యాడు. రెండు...మూడేళ్లగా ఆయన హీరోగా నటించిన సినిమాలేవి కూడా హిట్ అవ్వలేదు.
ఆ సినిమాల బడ్జెట్ కూడా 50 కోట్ల లోపే ఉంటుంది. అలాంటి నటుడికి 135 పారితోషికం ఇస్తున్నారంటే? నమ్మేది ఎలా? అయితే ఈ ప్రచారాన్ని అక్షయ్ కూడా ఖండిచాడు. మరి ఎంత తీసుకుంటున్నారు? అంటే అతడి నుంచి మాత్రం సరైన సమాధానం రాలేదు. అన్ని సినిమాలకు అంత మొత్తంలో కొంతైనా తీసుకుంటారుగా? అంటే అక్కడా స్కిప్ కొట్టారు. దీంతో అక్షయ్ పారితోషికంపై నెట్టింట పెద్ద చర్చే సాగుతోంది.
అలాగే నటీనటులు నిర్దిష్ట వయసు తర్వాత సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలా? అని అడగగా అందుకు అక్షయ్ రిటైర్మెంట్ అవసరం లేదని సమాధానం ఇచ్చారు. మరి కిలాడీ 2025లోనైనా హిట్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతాడా? లేదా? అన్నది చూడాలి. `స్కై పోర్స్`, `జాలీ ఎల్ ఎల్ బీ3, `హౌస్ ఫుల్ -5`సినిమాలు భారీ అంచనాల మద్య రిలీజ్ అవుతున్నాయి. వాటిపై అక్షయ్ కూడా చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నాడు.