Begin typing your search above and press return to search.

రూ.80 కోట్లకు ఫ్లాట్ అమ్మిన స్టార్ హీరో.. లాభం ఎంతంటే?

ఖిలాడీ అక్ష‌య్ కుమార్ కొన్ని వ‌రుస డిజాస్ట‌ర్ల‌తో ఎదురు దెబ్బ‌లు తిన్న సంగ‌తి తెలిసిందే. అయినా అత‌డు కెరీర్ ప‌రంగా ఎప్పుడూ ఖాళీగా లేడు.

By:  Tupaki Desk   |   7 Feb 2025 3:39 AM GMT
రూ.80 కోట్లకు ఫ్లాట్ అమ్మిన స్టార్ హీరో.. లాభం ఎంతంటే?
X

ఖిలాడీ అక్ష‌య్ కుమార్ కొన్ని వ‌రుస డిజాస్ట‌ర్ల‌తో ఎదురు దెబ్బ‌లు తిన్న సంగ‌తి తెలిసిందే. అయినా అత‌డు కెరీర్ ప‌రంగా ఎప్పుడూ ఖాళీగా లేడు. క్ష‌ణం తీరిక లేకుండా వ‌రుస సినిమాల్లో న‌టిస్తున్నాడు. అత‌డికి అందాల్సిన పారితోషికాలు అందుతూనే ఉన్నాయి. ఇక అక్ష‌య్ కుమార్ భార‌త‌దేశంలోని అత్యంత ధ‌నికులైన క‌థానాయ‌కుల్లో ఒక‌డిగా రికార్డుల‌కెక్కాడు.

అత‌డు త‌న సంపాద‌న‌ను తెలివిగా లాభ‌దాయ‌క‌మైన వ్యాపారాల్లో పెట్టుబ‌డులుగా పెడ‌తాడు. రియ‌ల్ ఎస్టేట్ పెట్టుబ‌డులు అత‌డికి ఒక మంచి ఆదాయ మార్గం. ఇప్ప‌టికే అత‌డు త‌న తెలివితేట‌లతో వంద‌ల కోట్లు ఆర్జించాడు. సినిమాల‌తో కంటే బ‌య‌ట వ్యాపారాల‌తో అత‌డి ఆదాయం ఎంతో పెద్ద‌ది. త‌న పెట్టుబ‌డుల ద్వారా భారతదేశం స‌హా విదేశాలలోను అత‌డికి చాలా ఆస్తులు ఉన్నాయి.

తాజా స‌మాచారం మేర‌కు.. అక్ష‌య్ ఇటీవ‌ల తాను సెంటిమెంట్ గా భావించే ఒక‌ ఫ్లాట్ ని అమ్మేశాడ‌ని తెలిసింది. ముంబై వర్లిలోని తన ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను దాదాపు రూ.80 కోట్లకు సేల్ చేసాడ‌ని తెలిసింది. ఇండెక్స్‌ట్యాప్.కామ్ లో ఆస్తి రిజిస్ట్రేషన్ రికార్డుల ప్రకారం ఈ వివ‌రాలు అందాయి. ఈ అపార్ట్‌మెంట్ వర్లిలోని 360 వెస్ట్ టవర్‌లో ఉంది. జనవరి 31న ఇది అమ్ముడైంది. టవర్ బిలోని 39వ అంతస్తులో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ 6,830 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీనికి నాలుగు పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి.

ఈ ఇంటి లావాదేవీకి రూ.4.8 కోట్ల స్టాంప్ డ్యూటీ కూడా కొనుగోలు దారుడు చెల్లించారు. దీనికి ముందు బోరివాలి తూర్పులోని తన వేరొక‌ అపార్ట్‌మెంట్‌ను అక్ష‌య్ రూ.4.25 కోట్లకు అమ్మాడు. స్క్వేర్‌యార్డ్స్ ద్వారా ఈ వివ‌రాలు తెలిసాయి. అత‌డు ఈ అపార్ట్‌మెంట్‌ను 2017లో రూ.2.38 కోట్లకు కొనుగోలు చేశాడు. అమ్మే స‌మ‌యానికి దాని విలువలో 78 శాతం పెరుగుదల ఉంది.

అక్షయ్ - ట్వింకిల్ ప్ర‌స్తుతం ఎక్క‌డ నివ‌శిస్తున్నారు? అంటే.. జుహులోని సముద్రానికి ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే అక్ష‌య్ ప్ర‌స్తుతం భూత్ బంగ్లా సినిమా షూటింగ్‌లో ఉన్నాడు. ప్రియ‌ద‌ర్శ‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. అక్ష‌య్ న‌టించిన స్కై ఫోర్స్ 100కోట్లు వ‌సూలు చేయ‌గా, ఈ సినిమా 160 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కింది. హేరా ఫేరి 3 , హౌస్ ఫుల్ 5 స‌హా ప‌లు చిత్రాల్లో అక్ష‌య్ న‌టించాల్సి ఉంది.

బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్, అత‌డి కుమారుడు అభిషేక్ బ‌చ్చ‌న్ తెలివిగా రియ‌ల్ ఎస్టేట్ లో ప‌ట్టుబ‌డులు పెట్టి, వాటిని తిరిగి రీసేల్ చేస్తూ భారీ లాభాలు ఆర్జిస్తున్నారు. అమితాబ్ ఇటీవ‌ల త‌న ఫ్లాట్ ని అమ్మి ఏకంగా 49 కోట్ల లాభం క‌ళ్ల జూసాడు. అక్ష‌య్ కుమార్ సైతం ఇదే బాట‌ను అనుస‌రిస్తున్నాడు. అయితే అత‌డు అమ్మేసిన ఫ్లాట్ పై ఎంత లాభం వ‌చ్చిందో వివ‌రాలు తెలియాల్సి ఉంది.