ట్రెండీ టాక్: బిగ్ `బ్రదర్స్` స్ట్రగుల్స్ ఆగేదెలా?
ఖిలాడీ అక్షయ్ కుమార్, సిద్ధార్థ్ మల్హోత్రా.. ఈ ఇద్దరూ నిస్సందేహంగా బాలీవుడ్ లో పెద్ద స్టార్లు. కానీ కొన్నేళ్లుగా సరైన హిట్టు లేక బ్యాక్ బెంచీకే పరిమితమయ్యారు.
By: Tupaki Desk | 2 Jan 2025 4:44 AM GMTఖిలాడీ అక్షయ్ కుమార్, సిద్ధార్థ్ మల్హోత్రా.. ఈ ఇద్దరూ నిస్సందేహంగా బాలీవుడ్ లో పెద్ద స్టార్లు. కానీ కొన్నేళ్లుగా సరైన హిట్టు లేక బ్యాక్ బెంచీకే పరిమితమయ్యారు. చాలా కాలంగా `ఒక్క హిట్టు ప్లీజ్!` అంటూ చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ విజయం దక్కడం లేదు. ఈ ఇద్దరూ ఇంతకుముందు `బ్రదర్స్` అనే డిజాస్టర్ యాక్షన్ చిత్రంలోను నటించారు.
అక్షయ్ కుమార్ కొన్నేళ్లుగా బ్యాడ్ ఫేజ్‌లో ఉండగా గత ఏడాది కూడా అతడికి బ్యాడ్ ఇయర్. కనీసం కొత్త సంవత్సరం అయినా కలిసొస్తుందని ఆశిస్తున్నాడు. అతడి ఆశలన్నీ వెల్ కం 3, జాలీ ఎల్ ఎల్.బి 3, హౌస్ ఫుల్ 5 వంటి ఫ్రాంఛైజీ చిత్రాలపైనే.. వీటిలో ఓ రెండు ఈ ఏడాది విడుదలవుతుండగా వెల్ కం 3 వచ్చే ఏడాదికే వస్తుంది. అక్షయ్ నటించిన స్కై ఫోర్స్ కూడా ఈ ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాల్లో నటిస్తున్నాడు అక్కీ. కానీ విడుదలైన ప్రతిదీ ఫ్లాపవుతుండడంతో నీరస పడిపోతున్నాడు. జనవరి 26న వస్తున్న సి.శంకరనాయర్ బయోపిక్ -స్కై ఫోర్స్ తనకు మంచి విజయాన్నిస్తుందని ఆశ. ఆ తర్వాత వరుస సీక్వెల్స్ అతడిని ఆదుకోవాలి.
మరోవైపు సిద్ధార్థ్ మల్హోత్రా ఏక్ విలన్, కపూర్ అండ్ సన్స్ (2016) తర్వాత సరైన హిట్టు లేక కష్టపడుతున్నాడు. 2025లో విడుదల కానున్న `పరమ సుందరి`తో గ్రేట్ కంబ్యాక్ సాధ్యమవుతుందని ఆశిస్తున్నాడు. కొన్ని వరుస ఫ్లాపుల తర్వాత అతడు నటించిన ఈ సినిమాపైనే అతడి హోప్స్ అన్నీ. ఈ చిత్రంలో జాన్వీకపూర్ కథానాయికగా నటించగా, మడాక్ ఫిలింస్ గోల్డెన్ హ్యాండ్ కలిసొస్తుందని ఆశిస్తున్నాడు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.