Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు స్టార్‌ హీరోకు రూ.100 కోట్ల కలెక్షన్స్‌

కొన్ని సినిమాలు ప్రమోషన్‌ ఖర్చులు రాబట్టలేక పోయాయి. అలాంటి పరిస్థితుల నుంచి అక్షయ్‌ కుమార్‌ మళ్లీ రూ.100 కోట్ల సినిమాను చేయగలిగాడు.

By:  Tupaki Desk   |   3 Feb 2025 4:30 PM GMT
ఎట్టకేలకు స్టార్‌ హీరోకు రూ.100 కోట్ల కలెక్షన్స్‌
X

బాలీవుడ్‌లో కరోనా ముందు అక్షయ్‌ కుమార్ సినిమా చేస్తే వంద కోట్ల వసూళ్లు అన్నట్లు ఉండేది. ఏడాదిలో మూడు నాలుగు సినిమాలతో వంద కోట్లు, అంతకు మించి వసూళ్లు దక్కించుకున్న స్టార్‌గా అక్షయ్‌ కుమార్‌ నిలిచారు. అలాంటి అక్షయ్‌ కుమార్‌ దాదాపు నాలుగు ఏళ్లుగా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా మినిమం వసూళ్లు సాధించని పరిస్థితి నెలకొంది. ఒకటి రెండు సినిమాలు కనీసం పాతిక కోట్ల వసూళ్లు దక్కించుకోలేక పోయాయి. కొన్ని సినిమాలు ప్రమోషన్‌ ఖర్చులు రాబట్టలేక పోయాయి. అలాంటి పరిస్థితుల నుంచి అక్షయ్‌ కుమార్‌ మళ్లీ రూ.100 కోట్ల సినిమాను చేయగలిగాడు.

స్కై ఫోర్స్ అనే హిందీ సినిమాతో అక్షయ్‌ కుమార్ చాలా కాలం తర్వాత బాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల వసూళ్లు రాబట్టాడు. ఇప్పటి వరకు దాదాపుగా ఈ సినిమా రూ.115 కోట్ల వసూళ్లు రాబట్టినట్లుగా సమాచారం అందుతోంది. సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో దాదాపుగా రూ.150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సినిమా బ్రేక్ ఈవెన్‌ సాధించాలి అంటే ఇంకా దాదాపుగా రూ.50 కోట్ల వసూళ్లు రాబట్టాల్సి ఉంది. ఆ స్థాయిలో కలెక్షన్స్‌ని ఈ సినిమా రాబట్టే అవకాశాలు ఉన్నాయా అనేది అనుమానంగా ఉంది. అయినా కూడా అక్షయ్‌ కుమార్‌ వంద కోట్ల వసూళ్లు రాబట్టడంతో ఆయన ఫ్యాన్స్‌కి పెద్ద ఊరటగా చెప్పుకోవచ్చు.

అక్షయ్‌ కుమార్‌ వరుస ఫ్లాప్స్‌తో సతమతం అవుతున్న సమయంలో వచ్చిన స్కై ఫోర్స్‌ సినిమా హిందీ ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆర్మీ బ్యాక్ డ్రాప్‌లో, ఎయిర్‌ ఫోర్స్‌ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన సినిమాలకు మంచి డిమాండ్‌ ఉంది. అందుకే అక్షయ్‌ కుమార్‌ కాస్త ఆలస్యంగానైనా ఈ సినిమాను చేసి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో స్కై ఫోర్స్ సినిమాకు భారీ వసూళ్లు నమోదు అయ్యాయి అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అక్షయ్‌ కుమార్‌ ఇక బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకుంటాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

బాలీవుడ్‌లో స్కై ఫోర్స్‌ సినిమా తర్వాత మరో రెండు మూడు సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా షాహిద్‌ కపూర్‌ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన దేవా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది. అందుకే స్కై ఫోర్స్‌ సినిమాకు వసూళ్లు కంటిన్యూ అవుతున్నాయి. మరో వారం రోజుల పాటు వసూళ్లు కంటిన్యూ అయితే కచ్చితంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రీచ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆకట్టుకునే యాక్షన్‌ సన్నివేశాలతో పాటు, దేశ భక్తిని కలిగించే కొన్ని సీన్స్ కారణంగా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటుంది. అందుకు తగ్గట్లుగానే వసూళ్లను రాబడుతోంది.