స్కై ఫోర్స్: ప్రశంసలు సరే.. కలెక్షన్‌లు ఏవి?
స్కై ఫోర్స్ ఓపెనింగ్ వసూళ్లు బావున్నాయి. ఆరంభం టికెట్లు భారీగా సేల్ అయ్యాయి. నిర్మాతలు చెప్పిన దాని ప్రకారం.. తొలి 3 రోజుల కలెక్షన్ నికరంగా రూ. 70 కోట్లు.
By: Tupaki Desk | 28 Jan 2025 2:30 AM GMTఖిలాడీ అక్షయ్ కుమార్ కి చాలా కాలంగా బ్యాడ్ టైమ్ రన్ అవుతోంది. అతడు తన సినిమాల కోసం వందశాతం ఎఫర్ట్ పెట్టి పని చేసే శ్రమ జీవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన పాత్ర కోసం ఎంత దూరం అయినా వెళతాడు. ఎంత కష్టానికి అయినా వెనకాడడు. కానీ అతడిని దురదృష్టం నీడలా వెంటాడుతోంది. దాదాపు అరడజను పైగా డిజాస్టర్లను ఎదుర్కొన్న అక్షయ్ కుమార్ తన హోప్స్ అన్నీ మంచి కంటెంట్ తో వస్తున్న `స్కైఫోర్స్` పైనే పెట్టుకున్నాడు. ఈ సినిమా హిట్టవుతుందని ఆశించాడు.
కానీ అనుకున్నది ఒకటి.. అయినది ఇంకొకటి. అక్షయ్ ఎంతో అద్భుతంగా నటించాడని, ద్వితీయార్థం చాలా ఎమోషనల్‌గా ఆడియెన్ కి కనెక్టయిందని `స్కై పోర్స్` గురించి విమర్శకులు ప్రశంసించారు. కానీ ఏం లాభం? ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏం సాధించింది? అంటే.. చాలా సందేహాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా టికెట్ ధరలు తగ్గించి అమ్మడంతో ఇప్పుడు ఇది లాభమా? నష్టమా? అనే సందేహాలు నెలకొన్నాయి.
స్కై ఫోర్స్ ఓపెనింగ్ వసూళ్లు బావున్నాయి. ఆరంభం టికెట్లు భారీగా సేల్ అయ్యాయి. నిర్మాతలు చెప్పిన దాని ప్రకారం.. తొలి 3 రోజుల కలెక్షన్ నికరంగా రూ. 70 కోట్లు. అయితే టికెట్ ధర రూ.50 లోపు అందుబాటులో ఉండేలా కూపన్లు, డిస్కౌంట్లను అమలు చేయడంతో మేకర్స్ కి ఏ విధంగా లాభం? ఇప్పటివరకూ వచ్చిన కలెక్షన్లలో 60శాతం మాత్రమే లెక్కలో చెప్పాలి. అంటే 35 కోట్ల లోపు మాత్రమే ఇప్పటివరకూ దక్కినట్టు అని విశ్లేషిస్తున్నారు.
నిజానికి ఒక టికెట్ ధర 200-250 మధ్య విక్రయించి ఉంటే లాభాలు వచ్చేవి. కానీ తగ్గించిన టికెట్ ధరో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని విశ్లేషిస్తున్నారు. కనీసం ఎక్కువమంది జనం థియేటర్లకు వచ్చారు గనుక ఇకపైనా మౌత్ పబ్లిసిటీతో ఈ సినిమా హౌస్ ఫుల్స్ తో మరో వారం పైగా ఆడితే అప్పుడు దీనికి కొంత రికవరీ సాధమవుతుందని అంచనా వేస్తున్నారు. కానీ అన్ని రోజులు సినిమా ఆడాలి కదా? అనే సందేహాలు అలానే ఉన్నాయి.