తెరపై లైన్‌లు చూసి డైలాగులు చెప్పే సూపర్‌స్టార్! డైరెక్టర్ ఏమన్నారంటే?
బాలీవుడ్ బబుల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అహ్మద్ మాట్లాడుతూ- ఒక్కో నటుడికి ఒక్కోలా వేర్వేరు వర్కింగ్ స్టైల్ ఉంటుందని టెలిప్రాంప్టర్‌ను ఉపయోగించడం కూడా ఒక నైపుణ్యమని అన్నారు.
By: Tupaki Desk | 14 Feb 2025 5:30 PM GMTస్టేజీ డ్రామా కళాకారుడికి ప్రాంప్టింగ్ తప్పనిసరి. చాలామంది స్టేజ్ వెనక నుంచి వేరొకరి ప్రాంప్టింగ్ సహాయం తీసుకుని డైలాగ్స్ చెబుతారు. కానీ ఇదే సౌకర్యాన్ని బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఉపయోగించుకోవడాన్ని తప్పు పడుతున్నారు. సన్నివేశం తెరకెక్కించేప్పుడు అతడు చేసే పనిపై కంటే స్క్రీన్‌పై అక్షరాలను చూడటంపైనే దృష్టి పెట్టాడని ఒక నెటిజన్ విమర్శించారు. `సర్ఫిరా` చిత్రీకరణ సమయంలో అక్షయ్ కుమార్ ఇలా చేసాడు అంటూ అతడు వీడియో ఆధారాన్ని కూడా సోషల్ మీడియాల్లో షేర్ చేసాడు. ఈ వీడియో క్షణాల్లో ఇంటర్నెట్ లో వైరల్ అయింది. దీనికి నెటిజనులు స్పందించారు.
తాజాగా సూపర్ స్టార్ ప్రామ్టింగ్ హ్యాబిట్ గురించి ప్రముఖ దర్శకుడు అహ్మద్ ఖాన్ స్పందించారు. బాలీవుడ్ బబుల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అహ్మద్ మాట్లాడుతూ- ఒక్కో నటుడికి ఒక్కోలా వేర్వేరు వర్కింగ్ స్టైల్ ఉంటుందని టెలిప్రాంప్టర్‌ను ఉపయోగించడం కూడా ఒక నైపుణ్యమని అన్నారు. కొందరు నటులు డైలాగ్‌లను గుర్తుంచుకోవడంపై మాత్రమే దృష్టి సారిస్తుండగా, అక్షయ్ కుమార్ ఎనర్జీని తెరపైకి తెస్తాడని , సన్నివేశాలను మెరుగుపరచడానికి తన సొంత సృజనాత్మక డైలాగుల్ని జోడిస్తాడని ఆయన పేర్కొన్నారు. అక్షయ్ కేవలం డైలాగ్‌లను గుర్తుంచుకోవడం కంటే సినిమాకి ఎక్కువ సహకారం అందించాలని నమ్ముతాడుని తెలిపాడు.
ఇన్‌స్టాలో ఒక వీఎఫ్ఎక్స్ నిపుణుడు `సర్ఫిరా` నుండి ఒక వీడియో క్లిప్‌ను షేర్ చేసి అక్షయ్ కుమార్ టెలిప్రాంప్టర్ చూస్తూ చదువుతున్నట్లు పేర్కొన్నారు. నటించే కంటే తెరపై లైన్‌లను అతడి కళ్లు వెతుకుతున్నాయని ఈ వీడియో చెబుతోంది. ఒక భావోద్వేగ సన్నివేశంలో అతడు తన ముందు ఉన్న వ్యక్తిపై కాకుండా డైలాగ్స్ పై దృష్టి సారించినట్లు కనిపించాడు. అయితే దీనిపై నెటిజనులు రకరకాల కామెంట్లు చేసారు.
అక్షయ్ కుమార్ నటించిన `స్కై ఫోర్స్` ఇటీవల విడుదలై ఒక మోస్తరు విజయాన్ని సాధించింది. కానీ వసూళ్లు ఎక్కువ చేసి చూపించారనే ఆరోపణలను ఎదురయ్యాయి. తదుపరి జాలీ ఎల్ఎల్బీ 3, హౌస్ ఫుల్ 5, భూత్ బంగ్లా, వెల్ కమ్ టు ది జంగిల్, హేరా ఫేరి 3 సినిమాల్లో నటిస్తూ ఖిలాడీ అక్కీ బిజీగా ఉన్నారు.