షాకింగ్: సూపర్‌స్టార్‌ని 2 గం.లు వెయిట్ చేయించారు
కానీ అక్కడ అతడికి ఊహించని షాక్. గంటల కొద్దీ సమయం ఎదురు చూడాల్సి వచ్చింది. అంత పెద్ద సూపర్‌స్టార్ అయినా కానీ, నొచ్చుకోకుండా చాలా సేపు వేచి చూసాడు.
By: Tupaki Desk | 20 Jan 2025 4:05 AM GMTఅతడు ఒక పెద్ద సూపర్‌స్టార్.. ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్నాడు. అతడు ఒక బుల్లితెర షో కోసం సమయాన్ని కేటాయించే పరిస్థితి ఎంతమాత్రం లేదు. కానీ తన సహచర హీరో కోరగానే కాదనకుండా కొంత సమయాన్ని కేటాయించాడు. అతడి మాటను గౌరవించాడు. సమయపాలనలో ఈ హీరో ది బెస్ట్ అని పరిశ్రమలో చెప్పుకుంటారు. చెప్పిన సమయానికే రావడం అతడి క్రమశిక్షణకు నిదర్శనం.
రియాలిటీ షో కోసం ఎంతో టంచనుగా రెడీ అయ్యి ఒక డెబ్యూ హీరోని తీసుకుని మరీ అతడు సెట్స్ పైకి షూట్ కోసం వచ్చాడు. కానీ అక్కడ అతడికి ఊహించని షాక్. గంటల కొద్దీ సమయం ఎదురు చూడాల్సి వచ్చింది. అంత పెద్ద సూపర్‌స్టార్ అయినా కానీ, నొచ్చుకోకుండా చాలా సేపు వేచి చూసాడు. కానీ హోస్ట్ కం హీరో ఇంతకీ రాడు అంతకీ రాడు! చివరికి తను కేటాయించిన సమయం అయిపోయింది. వేరొక సినిమా సెట్స్‌లో షెడ్యూల్ కోసం అతడు జాయిన్ కావాల్సి ఉంది. ఇదే విషయాన్ని సదరు సూపర్‌స్టార్ నేరుగా ఫోన్ లో అవతలి వ్యక్తికి చెప్పి అక్కడి నుంచి నిష్కృమించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాల్లో రియాలిటీ షో కర్తలు స్వయంగా పోస్ట్ చేసారు.
అయితే ఈ ఎపిసోడ్‌లో `షో హోస్ట్` ఒక పెద్ద స్టార్ అయ్యి ఉండి కూడా అలా మరో పెద్ద స్టార్ హీరోని వెయిట్ చేయించడం సరికాదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. చాలా సేపు వెయిట్ చేయడంతో అతడి విలువైన సమయం వృథా అయింది. చివరికి సింపుల్ గా `సారీ` చెప్పి మరొక ఎపిసోడ్ లో కలుద్దాం! అని చెప్పడం ఏమిటి? అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. సెట్ లో గంట ఎదురు చూసినా, అక్కడికి వచ్చేందుకు, తిరిగి వెళ్లేందుకు గంట, మేకప్ ప్రిపరేషన్ కోసం కొంత సమయం పడుతుంది కదా! చాలా విలువైన సమయం వృథా చేసారు అంటూ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.
ఈ మొత్తం మెలోడ్రామాలో వెయిట్ చేసిన స్టార్ హీరో మరెవరో కాదు.. ది గ్రేట్ అక్షయ్ కుమార్. వెయిట్ చేయించిన హోస్ట్ సల్మాన్ ఖాన్. కారణం ఏమిటో తెలీదు కానీ, సల్మాన్ బిగ్ బాస్ 18 గ్రాండ్ ఫినాలే సమయంలో ఇలా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది. ఊహించని ఈ సంఘటనతో ఇద్దరు నటుల మధ్య నిజంగా ఏం జరిగిందో అంటూ ఊహాగానాలు చెలరేగాయి. బిగ్ బాస్ 18 గ్రాండ్ ఫినాలే నేడు జరుగుతోంది.
అక్షయ్ కుమార్ వీర్ పహరియాతో కలిసి నటించిన `స్కై ఫోర్స్` జనవరి 24న విడుదలవుతోంది. సందీప్ కెల్వానీ- అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1965 ఇండియా-పాకిస్తాన్ వైమానిక యుద్ధం గురించిన నిజ కథ ఆధారంగా రూపొందింది. ఈ చిత్రంలో అక్షయ్ పాత్ర వింగ్ కమాండర్ OP తనేజా జీవితం నుండి ప్రేరణ పొందింది. ఇందులో సారా అలీ ఖాన్, నిమ్రత్ కౌర్ కూడా నటించారు. వీర్ పహరియా తెరకు పరిచయమవుతున్నాడు. అతడు ఈ చిత్రంలో దివంగత స్క్వాడ్రన్ లీడర్ అజ్జమద బి దేవయ్య పాత్రలో కనిపించనుండగా, సారా అతడి భార్యగా నటించింది.