చావా లో ఆయనకు మరీ అంత తక్కువా..?
కానీ ఒకసారి ఫాం కోల్పోతే మాత్రం అవకాశం ఇవ్వడమే ఎక్కువ అనేలా చేస్తారు.
By: Tupaki Desk | 19 Feb 2025 5:50 PM GMTకొన్నిట్లో వ్యక్తి అనుభవాన్ని బట్టి అతను తీసుకునే జీతం ఉంటుంది. ఐతే సినీ పరిశ్రమలో మాత్రం హిట్ ఇచ్చిన వాళ్లకే డిమాండ్ ఉంటుంది. అలా కాకుండా పెద్దగా ప్రభావం లేని వారి మీద అనవసరమైన ఖర్చు పెట్టాలని అనుకోరు. ముఖ్యంగా స్టార్ రెమ్యునరేషన్ ని అబ్జర్వ్ చేస్తే ఎవరైతే హిట్లు సూపర్ హిట్లు కొడతారో వాళ్లకే సినిమా సినిమాకు రెమ్యూనరేషన్ డబుల్ ట్రిపుల్ అవుతుంది. హీరోలే కాదు మిగతా ఆర్టిస్టులు కూడా అంతే. ఫాం లో ఉన్నప్పుడు పోటీ పడి మరి రెమ్యూనరేషన్ ఇస్తారు. కానీ ఒకసారి ఫాం కోల్పోతే మాత్రం అవకాశం ఇవ్వడమే ఎక్కువ అనేలా చేస్తారు.
ప్రస్తుతం బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అక్షయ్ ఖన్నా పరిస్థితి ఇలానే ఉంది. దగ్గర దగ్గర 30 ఏళ్ల ఎక్స్ పీరియన్స్ ఉన్న ఆయన ఒకప్పుడు ప్రతి సినిమాలో కనిపించే వారు. కానీ ఎందుకో మధ్యలో అసలు ఛాన్స్ లు రాలేదు. అయినా సరే వచ్చిన అరకొర అవకాశాలతో సరిపెట్టుకుంటూ వచ్చాడు అక్షయ్ ఖన్నా. ఇక లేటెస్ట్ గా చావా సినిమాలో కనిపించి అలరించాడు అక్షయ్ ఖన్నా. చావా సినిమాలో అతను నటించినందుకు గాను చాలా తక్కువ రెమ్యునరేషన్ అందించారని తెలుస్తుంది.
చావా సినిమా లో అక్షయ్ ఖన్నా నటించినందుకు గాను కేవలం రెండున్నర కోట్లను మాత్రమే ఇచ్చారని తెలుస్తుంది. అంతకుముందు దృశ్యం 2 సినిమాలో నటించిన ఆయనకు 2 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారట. ఆ సినిమా తర్వాత చావా ఛాన్స్ రాగా అందుకు రెండున్నర కోట్లు మాత్రమే ఇచ్చారట. 1997 నుంచి సినిమాల్లో నటిస్తూ వస్తున్న అక్షయ్ ఖన్నాకి మరీ ఇంత తక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడం పట్ల ఆడియన్స్ షాక్ అవుతున్నారు.
ఐతే సక్సెస్ ఫాం లో ఉన్న వారికే రెమ్యునరేషన్ అడిగినంత ఇస్తారు. కెరీర్ గ్యాప్ ఉన్న వారికి ఫాంలో లేని వారికి తక్కువ రెమ్యునరేషన్ తో లాగిచ్చేస్తారు. ఐతే ఖాళీగా ఉండటం కన్నా ఇలా సినిమాకు 2, 2.5 కోట్లు తీసుకున్నా బెటర్ కదా అని అక్షయ్ ఖన్నా భావిస్తున్నారు. చావా సినిమాలో విక్కీ కౌశల్, రష్మిక మందన్న లీడ్ పెయిర్ గా నటించార్య్. ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది.