Begin typing your search above and press return to search.

సెల్యూట్ చేసే కంటెంట్ తో కిలాడీ బ‌రిలోకి!

కిలాడీ అక్ష‌య్ కుమార్ ఎలాంటి ఫేజ్ లో ఉన్నాడో తెలిసిందే వ‌రుస ప‌రాజ‌యాల‌తో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కుంటున్నాడు.

By:  Tupaki Desk   |   19 Oct 2024 1:30 PM GMT
సెల్యూట్ చేసే కంటెంట్ తో కిలాడీ బ‌రిలోకి!
X

కిలాడీ అక్ష‌య్ కుమార్ ఎలాంటి ఫేజ్ లో ఉన్నాడో తెలిసిందే. వ‌రుస ప‌రాజ‌యాల‌తో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కుంటున్నాడు అయినా వాటితో సంబంధం లేకుండా కిలాడీ వేగం మాత్రం తగ్గించ‌లేదు. ప్లాప్ ల‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఆన్ సెట్స్ లో కొన్ని సినిమాలున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో బ‌యోపిక్ కి రెడీ అవుతున్నారు. ఈసారి ఏకంగా బ్రిటీష్ సామ్రాజ్యంపై తిరుగు బాటుకే పిలుపునిస్తున్నారు.

ఇంత‌కీ ఏంటి ఆ సినిమా? మ‌రో బయోపిక్ ఏదైనా చేస్తున్నారా? అంటే అవున‌నే చెప్పాలి. బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన న్యాయ‌వాది సి. శంక‌రన్ నాయ‌ర్ జీవిత క‌థ వెండి తెర‌కు ఎక్కించ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. రఘు పాలట్ - పుష్పా పాలత్ రచించిన `ది కేస్ దట్ షేక్ ది ఎంపైర్` పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. క‌ర‌ణ్ సింగ్ త్యాగీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఇదే ఆయ‌న‌కు ద‌ర్శ‌కుడిగా తొలి సినిమా. ఇంత‌వ‌ర‌కూ ఆయ‌న కేవ‌లం ర‌చ‌యిత‌గానే ఉన్నారు. ప్ర‌ఖ్యాత నిర్మాణ సంస్థ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి ముందుకొచ్చింది. కేఫ్ గుడ్ ఫిల్మ్స్- లియో మీడియా క‌లోక్టివ్ స‌హక‌రంతో ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తుంది. రిలీజ్ తేదీని కూడా ముందుగానే లాక్ చేసారు. మార్చి 14, 2025న థియే టర్లలో విడుదలకు రెడీ అవుతున్నారు. ఇందులో అక్ష‌య్ కుమార్-ఆర్ మాధ‌వ‌న్- అన‌న్యా పాండే కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

ఎవ‌రు ఏ పాత్ర పోషిస్తున్నారు? అన్న వివ‌రాలు ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. నాయ‌ర్ 1920లలో బ్రిటిష్ సామ్రాజ్యా నికి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేసిన ప్రఖ్యాత న్యాయవాది. ఈ పుస్తకం జలియన్ వాలాబాగ్ సమయంలో పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైఖేల్ ఓ'డ్వైర్, వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మాజీ సభ్యుడు చెట్టూర్ శంకరన్ నాయర్‌పై వేసిన పరువు నష్టం కేసు గురించి చెబుతుంది. ఈ ప‌రువు న‌ష్టం విచారణ లండన్‌లో ఐదున్నర వారాల పాటు కొనసాగింది. జ‌లియాన్ వాలా బాంగ్ ఉదంతాన్ని ఈ పుస్త‌కంలో ప్రచురించారు.