బొమ్మాళీకి భయపడే స్టార్ హీరో దిగొచ్చాడా?
అక్షయ్ పౌరసత్వాన్ని విమర్శించే వేదికలుగా సామాజిక మాధ్యమాలు తీవ్రంగానే ప్రేరేపించాయి
By: Tupaki Desk | 16 Aug 2023 6:29 AM GMTభారతీయుడిగా దేశభక్తిని తాను నటించే సినిమాల్లో ఆవిష్కరించేందుకు ఇష్టపడే అక్షయ్ కుమార్ కెనడియన్ పౌరసత్వం గురించి చాలా కాలంగా నిరసనలు ఉన్నాయి. సోషల్ మీడియాల్లో విమర్శల ఫర్వం కొనసాగింది. అతడిని కెనడియన్ కుమార్ అంటూ అవమానించిన వారు ఉన్నారు. భారతదేశం విషయంలో అతడి విధేయత నిబద్ధతను నెటిజనులు ప్రశ్నించారు. చాలా వేదికలపై చర్చోపచర్చలు జరిగాయి.
అంతేకాదు.. డిజిటల్ మీడియా (సోషల్ మీడియా) యుగంలో ప్రతిదీ చర్చగా మారిన తరుణంలో కెనడియన్ కుమార్ పై చర్చలు మరింత విస్తృతం అయ్యాయి. రకరకాల వేదికలపై అక్షయ్ మద్ధతుదారులు వ్యతిరేకులతో గొడవలు పడిన సందర్భాలున్నాయి. అక్షయ్ ద్వంద్వ పౌరసత్వంపై రకరకాల దృక్కోణాలను ఈ వేదికలపై షేర్ చేసుకున్నారు. కెనడియన్ కుమార్ అనే పదం నిజానికి అక్షయ్‌ని ఎంతో కలచివేసిందనడంలో సందేహం లేదు.
అక్షయ్ పౌరసత్వాన్ని విమర్శించే వేదికలుగా సామాజిక మాధ్యమాలు తీవ్రంగానే ప్రేరేపించాయి. చివరికి కెనడియన్ పౌరసత్వాన్ని వదులుకుని ఇప్పుడు భారతీయ పౌరసత్వాన్ని స్వీకరించి తన విదేయత, దేశభక్తిని చాటుకున్నాడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అక్కీ స్వయంగా తన భారత పౌరసత్వాన్ని అధికారికంగా ప్రకటించాడు. కొన్నేళ్లుగా తనను నిందించిన వారందరికీ అతడు ఆ రకంగా సమాధానమిచ్చాడు. తదుపరి అతడు పీఎం నరేంద్ర మోదీకి అనుకూలుడు అనే వివాదం నుంచి బయటపడేందుకు ఏం చేస్తాడో చూడాలి. తన సినిమాల్లో దేశభక్తిని చాటుకోవాలి. అదే సమయంలో అతడు మతతత్వానికి అనుకూలంగా లేనని నిరూపించాల్సి ఉందని నెటిజనులు విశ్లేషిస్తున్నారు.