Begin typing your search above and press return to search.

2024 లోనూ ఆ హీరోకి హ్యాట్రిక్ ప్లాప్ లు!

ఈ రెండు ఫలితాలో కిలాడీని నెట్టింట ఏ రేంజ్ లో ట్రోల్ చేసారో తెలిసిందే. దీంతో అక్ష‌య్ మ‌న‌సు సైతం బాధ‌ప‌డింది.

By:  Tupaki Desk   |   19 Aug 2024 9:30 AM GMT
2024 లోనూ ఆ హీరోకి హ్యాట్రిక్ ప్లాప్ లు!
X

బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. 2024 లోనైనా హిట్ తో బోణీ కొడ‌తానుకుంటే `బ‌డేమియాన్ చోటే మియాన్` తో ప్లాప్ తో ప‌ల‌క‌రించాడు. అటుపై `స‌ర్పిరా`తో నైనా సెట్ చేస్తాడ‌నుకుంటే? ఆ సినిమా ఫ‌లితం అంత‌క‌న్నా దారుణం. ఈ రెండు ఫలితాలో కిలాడీని నెట్టింట ఏ రేంజ్ లో ట్రోల్ చేసారో తెలిసిందే. దీంతో అక్ష‌య్ మ‌న‌సు సైతం బాధ‌ప‌డింది.

త‌న బాధ‌ని ఓపెన్ గానే చెప్పేసాడు. అలాగ‌ని ఆత్మ‌విశ్వాసాన్ని కోల్పోలేదు. హిట్ కొడ‌తాను..అన్ని లెక్క‌లు స‌రి చేస్తాను అనే న‌మ్మ‌కంతోనే ముందుకు సాగుతున్నాడు. ప్లాప్ ల గురించి..జీవితం గురించి ఓ సంద‌ర్భంలో పెద్ద క్లాసే తీసుకున్నాడు. దీంతో `ఖేల్ ఖేల్ మే` తోనైనా విజ‌యం అందుకుంటాడ నుకున్నారంతా. ఆగ‌స్ట్ 15న రిలీజ్ అయిన ఆ సినిమా కూడా డిజాస్ట‌ర్ ఖాతాలో ప‌డింది.

ఈ సినిమా వ‌సూళ్లు కూడా దారుణంగానే ఉన్నాయి. ఈ సినిమాతో పాటు `వేద‌`, `స్త్రీ-2` కూడా రిలీజ్ అవ్వ‌డంతో అక్ష‌య్ కుమార్ నిల‌బ‌డ‌లేక‌పోయాడు. అలాగ‌ని ఆ సినిమాతో అక్ష‌య్ ఒంట‌రిగానూ రాలేదు. ఫ‌ర్దీన్ ఖాన్ , వాణీ క‌పూర్, తాప్సీ, ప్ర‌గ్యాజైశ్వాల్ లాంటి అంద‌మైన భామ‌ల‌తో కలిసొచ్చాడు. అక్ష‌య్ ఇమేజ్ వ‌ర్కౌట్ అవ్వ‌క‌పోయినా క‌నీసం వీళ్ల బ్రాండ్ తోనైనా నెట్టుకొస్తుంద‌నుకున్నారు కానీ ప‌న‌వ్వ‌లేదు. వారంతంలో కూడా ఎలాంటి మెర‌గైన వ‌సూళ్లు రాబ‌ట్ట‌లేక‌పోయింది.

దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద తేలిపోవాల్సిన పరిస్థితి. మొత్తం ఈ సినిమా 25 కోట్ల వ‌ర‌కూ రిక‌వరీ చేసిన‌ట్లు వీకీ లె క్క‌ల్ని బ‌ట్టి తెలుస్తోంది. సినిమా బ‌డ్జెట్ చూస్తే 100 కోట్ల వ‌ర‌కూ ఉంది. అంటే నిర్మాత భారీ మొత్తాన్ని ఈ న‌ష్టాన్ని భ‌రించాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తుంది. ఆ సంగ‌తి ప‌క్క‌న బెడితే 2024 లో అక్ష‌య్ కెరీర్ లో హ్యాట్రిక్ ప్లాప్ న‌మోదైంది. `బ‌డే మియాన్ చోటే మియాన్`, `స‌ర్పిరా`, `ఖేల్ ఖేల్ మే` ప్లాప్ అవ్వ‌డంతో విష‌యం క్లియ‌ర్ గా ఉంది. త్వ‌ర‌లో స్కై పోర్స్ తో రాబోతున్నాడు. ఈ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.