Begin typing your search above and press return to search.

హిట్ సినిమా సీక్వెల్ ల్లో ప్లాప్ హీరో!

తాజాగా ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ న‌టుడు కిలాడీ అక్ష‌య్ కుమార్ హీరోగా ఎంపికైన‌ట్లు స‌మాచారం.

By:  Tupaki Desk   |   12 Aug 2024 1:30 PM GMT
హిట్ సినిమా సీక్వెల్ ల్లో ప్లాప్ హీరో!
X

1993 లో రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం 'తిరంగ‌' ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. రాజ్ కుమార్, నానా ప‌టేక‌ర్ హీరోలగా మెహుల్ కుమార్ తెర‌కెక్కిన సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ముంబైలోని ఓథియేట‌ర్ లో జ‌రిగిన బాంబు దాడుల నేప‌థ్యంలో రూపొందిన సినిమా ఇది. వాస్త‌వ సంఘ‌ట‌న కావ‌డంతో మ‌రింత సంచ‌ల‌నంగా మారింది. మ్యూజిక‌ల్ గానూ సినిమా ప్రేక్ష‌కుల‌కు మ‌రింత క‌నెక్ట్ అయింది.

తాజాగా ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ న‌టుడు కిలాడీ అక్ష‌య్ కుమార్ హీరోగా ఎంపికైన‌ట్లు స‌మాచారం. దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో రూపొందిన ఈ సినిమా ద్వారా ప్రేక్ష‌కుల‌కు ఇంకా తెలియాల్సిన అంశాలు చాలా ఉన్నాయ‌ని భావించిన బృందం సీక్వెల్ గా ముందుకొస్తుంది. అయితే ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అన్న‌ది ఇంకా క‌న్ప‌మ్ చేయలేదు.

అలాగే సినిమాలో చాలా మంది కొత్త నటీన‌టులు భాగ‌మ‌వుతార‌ని చిత్ర వ‌ర్గాలు తెలిపాయి. మెహుల్ కుమార్ ఇప్ప‌టికే వృద్ధాప్యంలో ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌సు 75 ఏళ్లు. ఈ నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడిగా కొత్త వాళ్ల‌ను తెర‌పైకి తెచ్చే అవ‌కాశం ఉంది. మ‌రి ఆ ఛాన్స్ ఎవ‌రు? అందుకుంటారు? అన్న‌ది చూడాలి.

ఇక బాలీవుడ్ లో సీక్వెల్ ప‌రంప‌ర గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. హిట్ సినిమా ప్రాంచైజీకి ఎన్ని సీక్వెల్స్ అయినా వ‌స్తుంటాయి. ద‌శాబ్ధాల క్రితం నాటి కంటెంట్ ని సైతం తవ్వి తీసి సీక్వెల్స్ చేయ‌డం అక్క‌డో స్టైల్. ఇది కేవ‌లం బాలీవుడ్ కి మాత్రమే చెల్లింది. వాటికి స‌క్సెస్ రేట్ కూడా అలాగే ఉంటుంది. ఫెయిలైంది? చాలా త‌క్కువ సంద‌ర్భాల్లోనే? అందుకే మేక‌ర్స్ అంతా సీక్వెల్స్ విష‌యంలో ఎంతో కాన్పిడెంట్ గా ముందుకెళ్తున్నారు.