ఆ హీరోకి అదొక్కటే స్వీట్ న్యూస్!
ఇప్పటికే అక్షయ్ ప్లాప్ లను ఉద్దేశించి నెట్టింట పుంకాలు పుంకాలుగా కథనాలు వైరల్ అవుతున్నాయి.
By: Tupaki Desk | 21 Aug 2024 9:32 AM GMTఆగస్టు15 స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని బాలీవుడ్ నుంచి `ఖేల్ ఖేల్ మే`, `వేదా`, స్త్రీ-2 చిత్రాలు రిలీజ్ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. వీటిలో `స్త్రీ-2` బ్లాక్ బస్టర్ అవ్వగా మిగిలిన రెండు చిత్రాలు ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. అక్షయ్ కుమార్ ఖాతాలో `ఖేల్ ఖేల్ మే`తో మరో ప్లాప్ మూవీ పడింది. అంతకు ముందు వరుస ప్లాప్ చిత్రాల గురించి మళ్లీ చెప్పాల్సిన పనిలేదు.
ఇప్పటికే అక్షయ్ ప్లాప్ లను ఉద్దేశించి నెట్టింట పుంకాలు పుంకాలుగా కథనాలు వైరల్ అవుతున్నాయి. కిలాడీ ప్లాపు లు చూసి ప్రేక్షకులే అయ్యో పాపం అనే పరిస్థితి వచ్చేసింది. చేసిన సినిమా కనీస వసూళ్లు కూడా తేకుండా పోవడంతోనే ఈ రకమైన పరిస్థితి కనిపిస్తుంది. అక్షయ్ కుమార్ కూడా ఈవిషయంలో ఎంతో నిరుత్సాంలో కనిపిస్తున్నాడు. మరి వీటన్నింటి నుంచి కాస్తైనా ఉపశమనం ఏదైనా ఉంది? అంటే `స్త్రీ-2` సక్సెస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇందులో వరుణ్ ధావన తో పాటు అక్షయ్ కుమార్ కూడా స్పెషల్ అప్పిరియన్స్ ఇచ్చారు. సినిమాలో వాళ్ల పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. తొలి షో అనంతరం రివ్యూల్లో శ్రద్దాకపూర్ సహా మెయిన్ స్ట్రీమ్ అందర్నీ ప్రశంశిస్తూనే అక్షయ్ పేర్లు కూడా చెబుతూ ప్రశం సించారు. దీంతో అక్షయ్ కుమార్ కి ఇది ఉపశమనా న్నిచ్చే విషయమే. రెండేళ్లు చేసిన సినిమాలన్నీ ప్లాప్ అనే మాట తప్ప కనీసం యావరేజ్ హిట్ అనే టాక్ కూడా ఏ సినిమాకి వినిపించలేదు.
అలాంటిది `స్త్రీ-2` సినిమా ఏకంగా వందల కోట్ల వసూళ్లతో దూసుకుపోతుంది. అందులో భాగం అవ్వడం అక్షయ్ కే కలిసొచ్చిన అంశంగా చెప్పాలి. ఒకవేళ స్త్రీ-2 కూడా బొల్తా కొడితే అక్షయ్ కుమార్ ఉన్నాడు ? కాబట్టే పోయింది అన్న నింద సైతం పడే అవకాశం ఉండేది. కానీ ఆ ఛాన్స్ ఇవ్వలేదు.