Begin typing your search above and press return to search.

14 ఫ్లాపులొచ్చినా డ‌జ‌ను సినిమాలతో హీరో బిజీ

అంతేకాదు.. వివేక్ ఒబెరాయ్ లాంటి స్టార్ అవ‌కాశాల్లేక‌ క్రైసిస్ లో ప‌డిపోయి, డిప్రెష‌న్ లోకి వెళ్లిన‌ప్పుడు తానున్నాన‌ని ఆదుకున్న హీరో కూడా అక్ష‌య్.

By:  Tupaki Desk   |   23 Aug 2024 3:45 AM GMT
14 ఫ్లాపులొచ్చినా డ‌జ‌ను సినిమాలతో హీరో బిజీ
X

ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా 14 ఫ్లాపుల‌ను ఎదుర్కొన్నాడు. అయినా అర‌డ‌జ‌ను సినిమాల‌కు సంత‌కాలు చేసాడు. మ‌రో అర‌డ‌జ‌ను క‌థ‌ల్ని క్యూలో ఉంచాడు. ద‌ర్శ‌కులంతా వెయిటింగ్. నిర్మాత‌ల‌కు అత‌డితో ఇబ్బందుల్లేవ్. ఇలాంటి క్రేజ్ ఉన్న హీరో ఏ ఇండ‌స్ట్రీలో ఉన్నాడు? అంటే.. అది క‌చ్ఛితంగా బాలీవుడ్ లో మాత్ర‌మే.

ఆ క్రేజీ హీరో మ‌రెవ‌రో కాదు ఖిలాడీ అక్ష‌య్ కుమార్.

త‌న‌ను అన్నివిధాలా అణ‌గ‌దొక్క‌డానికి ఒక సెక్ష‌న్ కుట్ర చేసింద‌ని, మీడియాతో క‌లిసి దుష్ప్ర‌చారం సాగిస్తోంద‌ని బ‌హిరంగంగా ఆరోపించిన అక్ష‌య్ కుమార్, తాను ఫ్లాపైతే సెల‌బ్రేష‌న్ చేసుకునేవాళ్లు ఉన్నార‌ని తీవ్రంగా వ్యాఖ్యానించాడు. అంతేకాదు.. వివేక్ ఒబెరాయ్ లాంటి స్టార్ అవ‌కాశాల్లేక‌ క్రైసిస్ లో ప‌డిపోయి, డిప్రెష‌న్ లోకి వెళ్లిన‌ప్పుడు తానున్నాన‌ని ఆదుకున్న హీరో కూడా అక్ష‌య్. ఈ విష‌యాన్ని వివేక్ ఒబెరాయ్ స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు.

అదంతా అటుంచితే అక్ష‌య్ ఎంపిక‌లు స‌రిగా లేవంటూ ఒక సెక్ష‌న్ మీడియా ఒక‌టే ఊద‌ర‌గొడుతోంది. అత‌డు ఫ్లాప్ డైరెక్ట‌ర్ల‌ను ఎంచుకుంటున్నాడ‌ని, స‌రిగా క‌థ‌ల్ని ఎంపిక చేయ‌డం లేద‌ని ఊద‌ర‌గొడుతున్నారు కొంద‌రు. కానీ అతడు ప‌ఠాన్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న ద‌ర్శ‌క‌నిర్మాత‌తో ప‌ని చేస్తున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్ తో క‌లిసి అత‌డు త‌న కంబ్యాక్ కోసం ప్లాన్ చేసాడు. అయితే ఈ చిత్రానికి మిల‌న్ లుథ్రియా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని తెలిసింది. మిల‌న్ లుథ్రియా పాత‌త‌రం ద‌ర్శ‌కుడు. 2010లో హిట్టు కొట్టాడు అంతే. ఆ త‌ర్వాత బాద్ షాహూ, త‌డ‌ప్ లాంటి ఫ్లాప్ లు తీసాడు. అందువ‌ల్ల అత‌డిని ఎంపిక చేయ‌డం స‌రికాద‌ని అంతా విమ‌ర్శిస్తున్నారు. అయితే అక్ష‌య్ తో ద‌శాబ్ధం క్రిత‌మే `వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై దోబారా` అనే సినిమా తీసాడు మిల‌న్. ఇది యావ‌రేజ్ గా ఆడింది. అందువ‌ల్ల ఇలాంటి డైరెక్ట‌ర్ తో సినిమా చేయ‌డం స‌రికాద‌ని వారిస్తున్నారు ఫ్యాన్స్. కానీ అక్ష‌య్ న‌మ్మ‌కం అంతా సిద్ధార్థ్ ఆనంద్ పైనే. ప‌ఠాన్ స‌హా ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ల‌ను అందించిన సిద్ధార్థ్ త‌న‌కు ఒక మంచి కంబ్యాక్ హిట్ ని ఇస్తాడ‌ని అక్ష‌య్ ఆశిస్తున్నాడు.

ఓవైపు కొత్త సినిమాల‌కు సంత‌కాలు చేస్తూనే ఇప్ప‌టికిప్పుడు అర‌డ‌జ‌ను సినిమాల్లో న‌టిస్తున్నాడు ఖిలాడీ. అక్షయ్ కుమార్ తదుపరి స్కై ఫోర్స్‌లో కనిపించనున్నారు. జాలీ ఎల్‌ఎల్‌బి 2, సింఘమ్ ఎగైన్, హౌస్‌ఫుల్ 5, హేరా ఫేరి 3, వెల్‌కమ్ టు ది జంగిల్ వంటి చిత్రాల్లో న‌టిస్తున్నాడు. సీక్వెల్ సినిమాల కింగ్ అనిపించుకుంటున్నాడు. మ‌రోవైపు సి శంకరన్ నాయర్ బయోపిక్ లోను అత‌డు న‌టించ‌నున్నాడు.