Begin typing your search above and press return to search.

మిషన్ మంగళ్ తర్వాత అక్షయ్ 'మిషన్ మూన్‌'?

చంద్రయాన్ 3 విజయంతో ఇప్పుడు ఖిలాడీ అభిమాన‌ సంఘాలు చంద్రయాన్ 3 నేప‌థ్యంలో సినిమాలో న‌టించాల‌ని కోరుకుంటున్నారు

By:  Tupaki Desk   |   24 Aug 2023 3:57 AM GMT
మిషన్ మంగళ్ తర్వాత అక్షయ్ మిషన్ మూన్‌?
X

చంద్రయాన్ 3 చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. ఈ చారిత్రాత్మక క్షణాన్ని భారతీయులు ఘనంగా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. ఇది నిజంగా అద్భుతమైన ఫీట్. ముఖ్యంగా 2019 లో చంద్ర‌యాన్ 2 విఫ‌ల‌ ప్రయత్నం తర్వాత చంద్రయాన్ వెనుక ఉన్న ఇస్రో శ్ర‌మ ఫ‌లించ‌డం ఒక గొప్ప అనుభూతి. ఇస్రో బృందాన్ని అభినందిస్తున్న భారతీయులతో పాటు, సెలబ్రిటీలు కూడా మిషన్ మూన్ విజయానికి సంబరాలు చేసుకుంటున్నారు. వారిలో అక్షయ్ కుమార్ ఒకరు. అయితే చంద్ర‌యాన్ 3 విజ‌యం నేప‌థ్యంలో అక్కీ అభిమానులు మరింత సంతోషిస్తున్నారు. వారు చంద్రయాన్ 3ని అక్షయ్ కుమార్‌తో అనుసంధానించారు.

అక్షయ్ కుమార్ అభిమానులు అతన్ని మిషన్ మూన్‌లో చూడాలనుకుంటున్నారు. పరిశ్రమలో దేశంలో అత్యంత కష్టపడి పనిచేసే సెలబ్రిటీలలో అక్షయ్ కుమార్ ఒకరు. ఇతర బాలీవుడ్ తారల మాదిరిగా కాకుండా అతడు ఒక సంవత్సరంలో అనేక సినిమాల్ని విడుద‌ల చేసేలా జాగ్ర‌త్త ప‌డ‌తాడు. అక్షయ్ అనేక ఆసక్తికరమైన విషయాలను పెద్ద తెరపైకి తీసుకొచ్చాడు. ప్యాడ్‌మ్యాన్ నుండి కేసరి వరకు,.. ఎయిర్‌లిఫ్ట్, బెల్ బాటమ్, మిషన్ మంగళ్ స‌హా కెరీర్ లో చెప్పుకోద‌గ్గ‌ ప్ర‌యోగాలు చేసాడు.

చంద్రయాన్ 3 విజయంతో ఇప్పుడు ఖిలాడీ అభిమాన‌ సంఘాలు చంద్రయాన్ 3 నేప‌థ్యంలో సినిమాలో న‌టించాల‌ని కోరుకుంటున్నారు. మిషన్ మంగళ్ తర్వాత, ఇప్పుడు అతడు మిషన్ మూన్‌లో న‌టిస్తాడని అభిమానులు భావిస్తున్నారు. 'చంద్రయాన్ 3' విజ‌యం నేప‌థ్యంలో సినిమాని అక్ష‌య్ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువస్తారని వారు భావిస్తున్నారు. మిషన్ మంగళ్ తర్వాత, అలాంటి చారిత్రాత్మక ఘట్టాన్ని పెద్ద తెరపైకి తీసుకురాగల సత్తా అక్షయ్‌కు ఉందని వారు భావిస్తున్నారు. అక్ష‌య్ కుమార్ న‌టించిన ఓ మైగాడ్ 3 స్లీప‌ర్ హిట్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌నిమా దాదాపు 150కోట్లు వ‌సూలు చేసింది.