Begin typing your search above and press return to search.

100 కోట్ల హీరోకు మరో దారుణమైన డిజాస్టర్

బాలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు అక్షయ్ కుమార్

By:  Tupaki Desk   |   14 July 2024 8:30 AM GMT
100 కోట్ల హీరోకు మరో దారుణమైన డిజాస్టర్
X

బాలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు అక్షయ్ కుమార్. మిగిలిన హీరోలతో పోల్చుకుంటే అందరికంటే వేగంగా సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ తో అక్షయ్ కుమార్ కెరియర్ పరంగా దూసుకుపోతున్నారు. ఏడాదికి కనీసం నాలుగు సినిమాతో అయిన అక్షయ్ కుమార్ ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. అన్ని రకాల జోనర్ లలో అక్షయ్ కుమార్ సినిమాలు చేస్తూ ఉన్నారు.

అయితే గత కొన్నేళ్ల నుంచి అక్షయ్ కుమార్ కి ఆశించిన స్థాయిలో సక్సెస్ లు అందడం లేదు. వరుసగా డిజాస్టర్లు వస్తున్నాయి. గత ఏడాది అక్షయ్ కుమార్ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు అన్ని డిజాస్టర్ అయ్యాయి. అలాగే ఈ ఏడాదిలో వచ్చిన బడే మియన్ చోటే మియన్ మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది. తాజాగా సర్ఫిరా మూవీతో అక్షయ్ కుమార్ ప్రేక్షకుల ముందుకి వచ్చారు. తమిళంలో సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన సూరరైపోట్రు మూవీ రీమేక్ గా సర్ఫిరా తెరకెక్కింది.

ఒరిజినల్ సినిమాకి దర్శకత్వం వహించిన సుధా కొంగరనే ఈ చిత్రాన్ని కూడా హిందీలో చేయడం విశేషం. అయితే సినిమా రిలీజ్ వరకు కూడా మూవీపై ఎలాంటి బజ్ క్రియేట్ కాలేదు. పెద్దగా పబ్లిసిటీ చేసినట్లు కూడా కనిపించలేదు. జులై 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్షయ్ కుమార్ కెరీర్ లోనే అత్యంత దారుణమైన ఫస్ట్ డే ఓపెనింగ్ కలెక్షన్స్ ఈ చిత్రానికి రావడం విశేషం. కేవలం మొదటి రోజు 2.55 కోట్ల కలెక్షన్స్ మాత్రమే సర్ఫిరా అందుకుంది.

ఆయన గత సినిమాల ట్రాక్ రికార్డుతో పోల్చుకుంటే అత్యంత లోయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ ఇవే అని బాలీవుడ్ వర్గాలలో వినిపిస్తోంది. మొదటిరోజు సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో సెకండ్ డే కలెక్షన్స్ పెరిగాయని తెలుస్తోంది. అయితే అవి ఏ స్థాయిలో సినిమానే నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్తాయనేది చెప్పలేని విషయం. వీకెండ్ తర్వాత మూవీ కలెక్షన్స్ ఇంకా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఏదైనా అద్భుతం జరిగితే తప్ప సర్ఫిరా మూవీ బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ గా నిలబడే ఛాన్స్ లేదని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని కూడా కమర్షియల్ గా ఫెయిల్ అయ్యే సినిమాగా సర్ఫిరా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అక్షయ్ కుమార్ గత సినిమాల ప్రభావం సర్ఫిరా పైన పడిందనే మాట వినిపిస్తోంది. అలాగే తమిళం, తెలుగు భాషలలో వచ్చిన సూరరై పోట్రు సినిమా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కావడం వల్ల చాలామంది ఇప్పటికే చూసేశారు. ఇది కూడా సర్ఫిరా కలెక్షన్స్ పైన ప్రభావం చూపి ఉంటుందని భావిస్తున్నారు.