ఖిలాడీనే టెన్షన్ పెట్టేస్తోన్న యంగ్ టైగర్!
దీంతో చిత్రాన్ని వరల్డ్ వైడ్ భారీ ఎత్తున రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే సరిగ్గా ఏప్రిల్ 5న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న 'దేవర' చిత్రాన్ని కూడా రిలీజ్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 9 Jan 2024 5:38 AM GMTకంటెంట్ ఆ కంటెంట్ కి తగ్గ కటౌట్ ఉన్న సినిమా పడితే పరభాషలు సైతం లైన్ క్లియర్ చేయాల్సిం దేనని ఇటీవలే 'సలార్ సీజ్ ఫైర్' ప్రూవ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి పోటీగా షారుక్ ఖాన్ నటించిన 'డంకీ' కూడా రిలీజ్ అయిన ఎలాంటి ఫలితాలు సాధించిందో తెలిసిందే. సలార్ ఎఫెక్ట్ డంకీ పై స్పష్టంగా పడిందన్నది వాస్తవం. 'సలార్' రిలీజ్ లేకుండా 'డంకీ' వసూళ్లు మరింత మెరుగ్గా ఉండేవి.
కానీ ఈ విషయాన్ని షారుక్ ఖాన్ చాలా లైట్ తీసుకున్నాడు. జవాన్..పఠాన్ లాంటి వరుస విజయాలతో 2000 కోట్ల వసూళ్లు రావడంతో డంకీని పెద్దగా పట్టించుకోలేదు. నిజానికి ఆ సినిమా ప్రచారం కూడా పెద్దగా చేయలేదన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడీ ప్రభావం మరో బాలీవుడ్ హీరోని టెన్షన్ పెడుతోందా? అతని గుండెల్లో ఇప్పటి నుంచే రైళ్లు పరిగెడుతున్నాయా? అంటే అవుననే అనిపిస్తుంది. ఖిలాడీ అక్షయ్ కుమార్ కి సరైన సక్సెస్ పడి చాలా కాలమవుతోన్న సంగతి తెఇసిందే.
కరోనా మొదలైన దగ్గర నుంచి ఆయనకు ఇంతవరకూ ఒక్క విజయం కూడా లేదు. సినిమాలు పూర్తిచేసి రిలీజ్ చేయడం తప్ప బాక్సాఫీస్ వసూళ్లు ఎక్కడ అంటే? సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యం లో ఏప్రిల్ 5న ఈద్ పండుగ సందర్భంగా యాక్షన్-అడ్వెంచర్ చిత్రం 'బడే మియాన్ చోటే మియాన్'పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ అలీ అబ్బాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టైగర్ ష్రాప్..పృథ్వీ రాజ్ సుకుమారన్ లాంటి స్టార్ హీరోలు కూడా ఇందులో నటిస్తున్నారు.
దీంతో చిత్రాన్ని వరల్డ్ వైడ్ భారీ ఎత్తున రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే సరిగ్గా ఏప్రిల్ 5న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న 'దేవర' చిత్రాన్ని కూడా రిలీజ్ చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాపై ఎలాంటి అంచనాలున్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో అంచానలు ఆకాశన్నంటుతున్నాయి. ఇదంతా పక్కనబెడితే 'ఆర్ ఆర్ ఆర్' విజయంతోనై టైగర్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు.
అటుపై బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఏకంగా 'వార్ -2' లో కూడా నటిస్తున్నాడు. దీంతో ఎన్టీఆర్ రేంజ్ హిందీ లో సైతం స్కైని టచ్ చేస్తుంది. ఆరకంగా దేవర బాలీవుడ్ రిలీజ్ కి ఇలా ఇంత బ్యాకప్ తోడవుతుంది. ఇప్పుడిదే టెన్షన్ అక్షయ్ కుమార్ లో మొదలైంది. ఎంత సీనియర్ హీరో అయితే మాత్రం టైగర్ ఎకి పోటీగా వెళ్లడం కరెక్టేనా? అన్న సందిగ్గం అతనిలో మొదలైనట్లు బాలీవుడ్ లో గుసు గుసలు మొదలయ్యాయి.