Begin typing your search above and press return to search.

1000 కోట్ల న‌ష్టాలు స‌రే ఆ హీరో తెచ్చిన లాభాలు చూడ‌రా?

అతడి వ‌ల్ల నిర్మాత‌ల‌ కు దాదాపు 1000 కోట్ల మేర న‌ష్టాలు వాటిల్లాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.

By:  Tupaki Desk   |   2 Aug 2023 4:19 AM GMT
1000 కోట్ల న‌ష్టాలు స‌రే ఆ హీరో తెచ్చిన లాభాలు చూడ‌రా?
X

సినిమా అనేది చ‌ద‌రంగం లాంటిది. ఇక్క‌డ పాము నిచ్చెన ఆట‌ ను స‌మ‌ర్థంగా ఆడాలి. గెలుపోట‌ములు అదృష్ట దుర‌దృష్టాలు ఇక్క‌డ‌ కీల‌క పాత్ర‌ను పోషిస్తుంటాయి. ఒక్కోసారి నిచ్చెన‌లు ఎక్కుతూ ముందుకు దూసుకుపోయే హీరోలు ఉన్న‌ట్టుండి పాము మింగడంతో పాతాళం లోకి ప‌డిపోతుంటారు. అలా చ‌ద‌రంగం లో నిచ్చెన మెట్లు ఎక్కుతూ కింద ప‌డ్డ హీరోగా ఖిలాడీ అక్ష‌య్ కుమార్ గురించి చ‌ర్చ సాగుతోంది.

అతడి వ‌ల్ల నిర్మాత‌ల‌ కు దాదాపు 1000 కోట్ల మేర న‌ష్టాలు వాటిల్లాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే అత‌డు ఇచ్చిన హిట్లు బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో అంత‌కుమించి నిర్మాత‌లు లేదా పంపిణీ వ‌ర్గాలు ఎగ్జిబిట‌ర్లు ఆర్జించార‌న్న‌ది గుర్తుంచుకోవాలి. ఇటీవ‌లి కాలం లో అక్ష‌య్ న‌టించిన కొన్ని సినిమాలు వ‌రుస‌గా ఫ్లాపుల‌య్యాయి.

వీటివ‌ల్ల పంపిణీవ‌ర్గాలు తీవ్రంగా న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చింది. అయితే ఈ నష్టాలు ఏ ఒక్క‌రికో వ‌ర్తించ‌వు. ఇవి వాటాలుగా పంపిణీ అవుతాయి. నిర్మాతలు-పంపిణీదారులు సహా వివిధ వాటాదారుల మధ్య ఈ న‌ష్టం షేర్ అవుతుంది. దానివ‌ల్ల ఒక్క‌రికే త‌ల‌ కు మించిన భారం ప‌డే అవ‌కాశం లేదు.

ప్రస్తుత మార్కెట్ వ్యవస్థ ప్రకారం భారీ బడ్జెట్ సినిమా పరాజయం పాలైనప్పుడు అత్యధికంగా నష్టపోయే వారి లో పంపిణీదారులు ఉన్నారు. అక్షయ్ కుమార్ ఇటీవ‌ల న‌టించిన రెండు భారీ సినిమాల‌ తో 400 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూడాల్సి వ‌చ్చింది. సామ్రాట్ పృథ్వీరాజ్ - రామ్ సేతు వంటి సినిమాలు వరుసగా 140 కోట్లు - 70 కోట్ల షేర్లతో ఈ నష్టాలకు కారణమయ్యాయి. వీటికి తోడు.. రక్షాబంధన్, బచ్చన్ పాండే, తాషాన్, రౌడీ రాథోడ్., కంభక్త్ ఇష్క్ ఇవ‌న్నీ ఫ్లాప్‌లుగా మిగ‌ల‌డంతో న‌ష్టాలు వెయ్యి కోట్ల‌కు చేరుకున్నాయ‌ని విశ్లేషిస్తున్నారు.

అయితే 100 పైగా సినిమాల్లో న‌టించిన అక్ష‌య్ కెరీర్ లో 40శాతం స‌క్సెస్ రేటుతో త‌న నిర్మాత‌లు పంపిణీదారుల‌ కు బోలెడంత లాభాల్ని పంచాడు. 60శాతం ప‌రాజ‌యాల్ని ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. కొన్ని న‌ష్ట‌పోయినా అనేక సూపర్ హిట్ చిత్రాల తో ఎంద‌రినో ధ‌న‌వంతుల‌ను చేసాడు అక్కీ. విజ‌యం సాధించిన వాటిలో కొన్ని తక్కువ బడ్జెట్‌ల తో నిర్మించిన‌వి ఉన్నాయి.

ఇవ‌న్నీ గణనీయమైన లాభాలను ఆర్జించాయి. ఖిలాడీ లోని ఈ క్వాలిటీ త‌న‌ ని స్టార్ హీరో స్టాట‌స్ లో నిల‌బెట్టింది. బాలీవుడ్ లో భారీ పారితోషికాలు అందుకునే హీరోగా అత్యధిక మొత్తం ప‌న్ను చెల్లించే హీరోగా ను అత‌డికి గుర్తింపు ఉంది.