Begin typing your search above and press return to search.

అటు-5..ఇటు-3 ఏంది బాస్ ఈస్పీడ్!

కిలాడీ అక్ష‌య్ కుమార్ జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 May 2024 6:53 AM GMT
అటు-5..ఇటు-3 ఏంది బాస్ ఈస్పీడ్!
X

కిలాడీ అక్ష‌య్ కుమార్ జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. విమ‌ర్శ లొచ్చినా .. ప్ర‌శంస‌లొచ్చినా ఆయ‌న‌కు సంబంధం లేదు. త‌న‌ప‌ని కేవ‌లం న‌టుడిగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోవ‌డ‌మే అంటూ ముందుకుసాగిపోతున్నారు. విమ‌ర్శ‌లు..ట్రోలింగ్ ల‌కు ఇప్ప‌టికే తాను బాగా అల‌వాటు ప‌డిపోయాన‌ని ఓపెన్ గానే చెప్పేసారు. ఇప్ప‌టికే అక్ష‌య్ ఖాతాలో డ‌జ‌ను సినిమాలున్నాయి. 2024 షెడ్యూల్ అంతా ఫుల్ అయింది.

వ‌చ్చే ఏడాది షెడ్యూల్ కూడా ఇప్ప‌టి నుంచి నింపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో రెండు సినిమాలు క‌మిట్ అయిన‌ట్లు తెలుస్తోంది. కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా సంచ‌ల‌నం సృష్టించిన హౌస్ ఫుల్ ప్రాంచైజీ నుంచి మ‌రో సినిమా రాబోతుంది. `హౌస్ పుల్` నుంచి వ‌స్తోన్న ఐద‌వ చిత్రం ఇది. తాజాగా ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లో యూకే లో మొదులు కానుంది. సాజిద్ న‌డియావాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్ర‌స్తుతం స్టోరీ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఆగ‌స్టులో షూటింగ్ ప్రారంభించాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. అక్ష‌య్ కుమార్..రితేష్ దేశ్ ముఖ్ తొలుత షూటింగ్ లో పాల్గొంటారు. కోర్ట్ రూమ్ డ్రామాగా తెర‌కెక్కి మంచి విజ‌యం సాధించిన `జాలీ ఎల్ ఎల్ బీ` నుంచి మూడ‌వ భాగం కూడా షురూ అయింది. సుభాష్ క‌పూర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైన‌ట్లు అక్ష‌య్ కుమార్ ఇన్ స్టా వేదిక‌గా రివీల్ చేసారు.

త్వ‌ర‌లో ఢిల్లీలో కొత్త షెడ్యూల్ మొద‌ల‌వుతుంది. అందులో అక్ష‌య్ కుమార్ కూడా పాల్గొంటారు. అయితే ఈ సినిమా నుంచి మ‌రో భాగం వ‌స్తున్న‌ట్లు తొలుత ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌లేదు. నేరుగా లాంచ్ అయిన త‌ర్వాత సినిమా అప్ డేట్స్ తోనే చిత్ర యూనిట్ ముందుకొచ్చింది. ఇందులో ఆర్షాద్ వార్సీ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇలా అక్ష‌య్ కుమార్ ఆల్రెడీ సెట్స్ లో ఉన్న సినిమాల‌తో పాటు మ‌రో రెండు సినిమా షూటింగ్ కి రెడీ అవుతున్నాడ‌ని తెలుస్తోంది.