అలనాటి రామచంద్రుడు టీజర్: ఎమోషనల్ లవ్
మీ హృదయాన్ని హత్తుకునే మెస్మరైజింగ్ ప్రేమకథ అంటూ మేకర్స్ బుధవారం రిలీజ్ చేశారు.
By: Tupaki Desk | 24 Jan 2024 2:52 PM GMTయంగ్ అండ్ టాలెంటెడ్ కృష్ణ వంశీ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త ప్రేమకథా చిత్రం అలనాటి రామచంద్రుడు. షార్ట్ ఫిల్మ్స్ తెరెకెక్కించి పలు అవార్డులు అందుకున్న చిలుకూరి ఆకాష్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మోక్ష హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్.. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ పొందింది. డీసెంట్ లుక్ లో ఉన్న ఆ పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచింది.
తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. మీ హృదయాన్ని హత్తుకునే మెస్మరైజింగ్ ప్రేమకథ అంటూ మేకర్స్ బుధవారం రిలీజ్ చేశారు. సీతమ్మ సరసన.. అంటా సాగే మెలోడియస్ పాటతో టీజర్ ప్రారంభమైంది. మా అమ్మ ఎప్పుడూ చెప్పేది.. మనల్ని ఎవరైనా ప్రేమిస్తే.. ఎన్ని కారణాలు అడ్డు వచ్చినా.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ ప్రేమను చనిపోయే వరకు వదులుకోకూడదు అంటూ వచ్చిన బ్యాక్ గ్రౌండ్ డైలాగ్ మనసును హత్తుకుంటోంది.
హీరోయిన్ ను లవ్ చేస్తున్న హీరో ఆమెకు చెప్పకుండా కాస్త టైమ్ తీసుకుంటాడు. ఆ సమయంలో అమాయకంగా హీరో నటన బాగుంది. వర్షంలో హీరోయిన్ మోక్ష ఎంట్రీ అదిరిపోయింది. గ్లామరస్ లుక్స్ తో ఫిదా చేసింది. హీరోహీరోయిన్ల మధ్య క్యూట్ డైలాగ్స్ సూపర్ గా ఉన్నాయి. చందమామ చేరుకోవడమే ఆ పావురం గమ్యం.. నిన్ను చేరుకోవడమే లక్ష్యం అంటూ హీరో చెప్పిన డైలాగ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.
నాకు నేచర్ ఫిలాసిపీ అంటే ఇష్టం. ముందు పరీక్ష పెడుతుంది. తర్వాత బాధపెడుతుంది. ఆ తర్వాత మనం జాగ్రత్తగా చూసుకంటామని సపోర్ట్ చేస్తే మనల్ని సపోర్ట్ చేస్తుంది అంటూ హీరో చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. అలా టీజర్ ఒక్కసారిగా ఎమోషనల్ మోడ్ లోకి వెళ్లింది. ఆ రాముడు సీత కోసం ఒక్కసారి యుద్ధం చేస్తే.. నా సీత కోసం ప్రతిక్షణం నాతో నేనే యుద్ధం చేస్తున్నా అంటూ హీరో చెప్పిన డైలాగ్.. సినిమా కథాంశాన్ని చెబుతోంది. మొత్తంగా టీజర్.. డిఫరెంట్ ఫీల్ తెప్పిస్తోంది.
ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స బ్యానర్ పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. నటుడు బ్రహ్మాజీ , సీనియర్ నటి సుధ, ప్రమోదిన, వెంకటేష్ కాకమును, చైతన్య గరికిపాటి తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శశాంక్ తిరుపతి సంగీతం అందిస్తున్నారు. ప్రేమ్ సాగర్ కెమరామెన్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి జేసీ శ్రీకర్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.