Begin typing your search above and press return to search.

వీడియో: పింక్ బికినీలో స్టార్‌కిడ్ హొయ‌లు

తాజాగా పింక్ బికినీలో హొయ‌లు పోతున్న ఓ వీడియో షూట్ ని ఇన్ స్టాలో షేర్ చేయ‌గా అది తుఫాన్ స్పీడ్ తో యూత్ లోకి దూసుకెళ్లింది.

By:  Tupaki Desk   |   30 Nov 2024 6:30 PM GMT
వీడియో: పింక్ బికినీలో స్టార్‌కిడ్ హొయ‌లు
X

ప్ర‌ముఖ న‌టి పూజా భేడి న‌ట‌వార‌సురాలు అలయ.ఎఫ్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఈ భామ కెరీర్ ఆరంభ‌మే న‌టిగా త‌న‌ను తాను నిరూపించుకుంది. డ్యాషింగ్ పెర్ఫామెన్సెస్ తో యువ‌త‌రంలో ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. కెరీర్ ప‌రంగా సెల‌క్టివ్ గా ముందుకెళుతున్న ఆల‌య ఎఫ్ ఇంత‌కుముందు సైఫ్ అలీఖాన్ లాటి సీనియ‌ర్ స‌ర‌స‌నా ఓ సినిమాలో న‌టించింది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోను బికినీ షూట్ల‌తో ఈ కిల్ల‌ర్ బ్యూటీ యూత్ కి మైండ్ బ్లాక్ చేస్తోంది. తన 27వ పుట్టినరోజును పుర‌స్క‌రించుకుని నవంబర్ 28న గోవాలో స్నేహితులు ప్రియమైనవారితో కలిసి ఫుల్ గా చిల్ చేసింది.

పెద్ద తెర‌ను మ‌రింగించ‌డంలో లేదా సోష‌ల్ మీడియాల్లో చెల‌రేగ‌డంలో ఈ బ్యూటీ స్టైలే వేరు. ఇటీవ‌లే బ‌ర్త్ డే పార్టీ నుంచి కొన్ని ఫోటోల‌ను తన అభిమానుల కోసం ఇన్ స్టాలో షేర్ చేసింది. గోవా ట్రిప్ లోంచి హిడెన్ ఫోటోషూట్ల‌ను ఒకటొక‌టిగా ఇప్ప‌టికీ ఇన్ స్టాలో రిలీజ్ చేస్తోంది ఆల‌య‌.

తాజాగా పింక్ బికినీలో హొయ‌లు పోతున్న ఓ వీడియో షూట్ ని ఇన్ స్టాలో షేర్ చేయ‌గా అది తుఫాన్ స్పీడ్ తో యూత్ లోకి దూసుకెళ్లింది. ఈ వీడియోలో ఆల‌య పింక్ బికినీ.. దానికి కాంబినేష‌న్ గా టోన్డ్ బాడీతో ధ‌గ‌ధ‌గ‌లాడింది. యూనిక్ లుక్ తో టోన్డ్ బాడీతో మురిపించ‌డంలో.. వ‌య్యారాల వ‌డ్డ‌న‌లో మేనివిరుపుల్లో త‌న‌ను కొట్టేవాళ్లే లేరు! అనే రేంజులో రెచ్చిపోయింది. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఈడియో ఇంట‌ర్నెట్ లో జోగారు వైర‌ల్ అయిపోతోంది. ఆల‌య టోన్డ్ బాడీ ఫిట్ లుక్ చూశాక యూత్ మైండ్ బ్లాక్ అయింది. ఈ లుక్ కోసం జిమ్ లో ఈ బ్యూటీ ఏ రేంజులో వ‌ర్క‌వుట్లు చేస్తుందో దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవాలి. బాలీవుడ్ లో ఉన్న అరుదైన ఫ్యాష‌నిస్టాల్లో ఆల‌య పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ముఖ్యంగా యువ‌త‌రం మెచ్చే మ్యాక్స్ బ్రాండ్ స‌హా ప‌లు కార్పొరెట్ ఉత్ప‌త్తుల‌ ప్ర‌చారంలోను ఆల‌య స్పీడ్ గా ఉంది. ఆల‌య ఫోటోషూట్ల‌కు మౌని రాయ్, మహిమా మక్వానా, రాషా థడానీ, ఆయుష్మాన్ ఖురానా, సబా పటౌడి వంటి ప్రముఖులు స్పందించి ర‌క‌ర‌కాల వ్యాఖ్య‌లు చేసారు.

కెరీర్ ప‌రంగా చూస్తే... అలయ ఎఫ్ 2020లో జవానీ జానేమాన్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంలోనే సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి నటించింది. ఈ చిత్రంలో నటనకు 2021లో ఉత్తమ ఆరంగేట్ర క‌థానాయిక‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది. ఫ్రెడ్డీ, ఆల్మోస్ట్ ప్యార్ విత్ DJ మొహబ్బత్, U-టర్న్ చిత్రాల్లో న‌టించిన అలయ ఎఫ్ ప్ర‌తిసారీ విలక్షణమైన పాత్రలను ఎంపిక చేసుకుంది. అన్నిటా న‌టిగా మెప్పించింది. అందుకే ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీని తెరపై చూడాలని అభిమానులు తహతహలాడుతున్నారు. నటిగానే కాకుండా అలయ ఎఫ్ మనోహరమైన వ్యక్తిత్వం గాళ్స్ లో స్ఫూర్తి నింపుతోంది. ఆల‌య సోషల్ మీడియాలో పోస్ట్ ల‌ను అభిమానులు ఎంత‌గానో ఇష్టపడతారు. బడే మియాన్ చోటే మియాన్ , ఏక్ ఔర్ గ‌జ‌బ్ క‌హానీ చిత్రాల్లోను ఆల‌య ఎఫ్ న‌టించింది. ఇటీవల` శ్రీకాంత్‌` అనే బ‌యోపిక్ చిత్రంలో రాజ్‌కుమార్ రావుతో కలిసి వీర స్వాతి పాత్రలో కనిపించింది. ఖో గయే హమ్ కహాన్ సీక్వెల్‌లోను ఆల‌య‌ నటించారు. ఈ ప్రాజెక్ట్‌లో అనన్య పాండే, సిద్ధాంత్ చతుర్వేది , ఆదర్శ్ గౌరవ్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.