Begin typing your search above and press return to search.

హీటెక్కించేలా ఆ బ్యూటీ హాట్ సెల్పీ!

తాజాగా మ‌రో హాట్ పిక్ కం వీడియో తో నెట్టింట్లోకి వ‌చ్చేసింది. ఇదిగో ఇక్క‌డి బ్లాక్ క‌ల‌ర్ స్పోర్స్ట్ దుస్తుల్లో అల‌రించింది. లెగ్ ఎక్స‌ర‌సైజ్ లు చేస్తూ త‌న లో బ్యూటీని సైతం హైలైట్ చేసింది.

By:  Tupaki Desk   |   17 Oct 2024 12:30 AM GMT
హీటెక్కించేలా ఆ బ్యూటీ హాట్ సెల్పీ!
X

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలయ ఎఫ్ టెంప్టింగ్ ఎలివేష‌న్ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అందాల ఆరబోత‌లో త‌న‌దైన మార్క్ వేస్తుంది. ఎప్ప‌టిక‌ప్పుడు ఫ్యాష‌న్ ఎంపిక‌ల్లోనూ చూప‌రుల‌ను ఆక‌ట్టుకుం టుంది. డిజైన‌ర్స్ దుస్తుల్లో ఎలా ప్రోజెక్ట్ అవ్వాలో? ప‌క్కాగా తెలిసిన బ్యూటీ. న‌లుగురిలా కాకుండా నాకో స్టైల్ ఉందంటూ రుజువు చేస్తుంటుంది.

తాజాగా మ‌రో హాట్ పిక్ కం వీడియో తో నెట్టింట్లోకి వ‌చ్చేసింది. ఇదిగో ఇక్క‌డి బ్లాక్ క‌ల‌ర్ స్పోర్స్ట్ దుస్తుల్లో అల‌రించింది. లెగ్ ఎక్స‌ర‌సైజ్ లు చేస్తూ త‌న లో బ్యూటీని సైతం హైలైట్ చేసింది. ప‌నిలో ప‌నిగా కెమెరా అన్ చేసి సెల్పీలు తీసుకుంది. ఎడ‌మ కాలి పాదాన్ని పైకి కింద‌కు లిప్ట్ చేస్తూ థై భాగంలో కొవ్వును క‌రిగిస్తుంది. అమ్మ‌డు జిమ్ వేర్స్ లో ఉన్నా? ఎంతో అందంగా ముస్తాబయ్యే ఎక్స‌ర‌సైజ్ లు షురూ చేసిన‌ట్లుంది.

ఇది ఎంతో క‌ఠిన‌మైన ట్రైనింగ్ అంటూ క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో, వీడియో నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. కామెంట్ బాక్సులో నెటి జ‌నుల కామెంట్లు అంతే ఆస‌క్తిక‌రం. అల‌య బ్యూటీని పొగిడేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇక అమ్మ‌డి కెరీర్ సంగ‌తి చూస్తే...

'జవానీ జానెమాన్' చిత్రంతో బాలీవుడ్ లో అరంగేట్రం చేసిన ఆలయ తొలి ప్ర‌య‌త్నంలోనే విమర్శకుల ప్రశంసలంద‌కుంది. కొంత గ్యాప్ త‌ర్వాత మొట్ట మొదటి మ్యూజిక్ వీడియోతో అభిమానుల ముందుకు వ‌చ్చింది. ఇటీవ‌ల రెండు..మూడు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చినా అవి ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. అయినా అల‌యా జోరు ఏమాత్రం త‌గ్గ‌లేదు. చేతినిండా అవ‌కాశాల‌తో క‌నిపిస్తుంది.