Begin typing your search above and press return to search.

లెహంగాలో క్లీవేజ్ ఫోజులతో కవ్విస్తున్న అలాయా..!

బాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో వరస అవకాశాలు అందుకుంటోన్న బ్యూటీ అలాయా

By:  Tupaki Desk   |   5 Aug 2023 11:36 AM GMT
లెహంగాలో క్లీవేజ్ ఫోజులతో కవ్విస్తున్న అలాయా..!
X

బాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో వరస అవకాశాలు అందుకుంటోన్న బ్యూటీ అలాయా. ఈ బామ ఇండస్ట్రీలోకి ఇటీవలే అడుగుపెట్టింది. కానీ, అడుగుపెట్టి పెట్టగానే అందరినీ తన అందంతో ఆకర్షించడం మొదలుపెట్టింది. జవానీ జానేమన్ సినిమాతో అలాయా బాలీవుడ్ లో అడుగుపెట్టింది. మొదటి సినిమాలోనే ఆమె అందానికి అందరూ ఫిదా అయిపోయారు.


ఆ తర్వాత ఆమెకు మరో, రెండు మూడు సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఫ్రెడ్డీ మూవీలో నటించింది. ఈ మూవీలో గ్లామర్ కూడా ఒలకబోసింది. లిప్ లాక్ సీన్లతో హీటు కూడా పెంచింది. కానీ ఈ మూవీ పెద్దగా క్లిక్ కాలేకపోయింది. కాగా, ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ చాలా చురుకుగా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన అందాలను సోషల్ మీడియాలో ఆరబోస్తూ ఉంటుంది. తాజాగా లెహంగాలో మెరిసింది. క్లీవేజ్ షోతో హీటు పెంచేసింది. ఈ ఫోటోలు చూసి కుర్రాళ్ల మతిపోతోంది. హాట్, సూపర్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ అలాయా పూర్తి పేరు అలాయా ఇబ్రహీం ఫర్నీచర్ వాలా. ఒకప్పటి అందాల తార పూజా బేడీ కుమార్తె ఈ అలాయా. కబీర్ బేడీకి మనవరాలు.

ముంబయిలోని జమ్నాబాయి నర్సీ స్కూల్ లో చదువుకుంది. సినిమాల్లో ఎంట్రీ ఇవ్వక ముందే న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ మొదలుపెట్టింది. ఆ తర్వాతే తన పేరును అలాయా ఎఫ్ గా మార్చుకుంది. కాగా, ఈమె తన మొదటి సినిమాలోనే గర్భిణీ గా నటించి అందరికీ షాకిచ్చింది, ఇక ఫ్రెడ్డీ మూవీలో సైతం హీరోని మోసం చేసే పాత్రలో నటించింది.

గ్లామర్ గా కనిపిస్తూనే, నటకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. మొదటి సినిమాలోనే తన నటనకు ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకోవడం విశేషం. అలాయాకు ఇన్ స్టాగ్రామ్ లో 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఏడాది ఆమె యూటర్న్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది సమంత చేసిన యూటర్న్ కి రీమేక్ కావడం విశేషం.