Begin typing your search above and press return to search.

ఆస్కార్ అవార్డు విన్న‌ర్ మృతి!

హాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ ఆస్కార్‌ అవార్డ్ విన్నర్‌, చిత్రనిర్మాత ఆల్బర్ట్ ఎస్ రడ్డీ (94) కన్నుమూశారు.

By:  Tupaki Desk   |   29 May 2024 11:38 AM GMT
ఆస్కార్ అవార్డు విన్న‌ర్ మృతి!
X

హాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ ఆస్కార్‌ అవార్డ్ విన్నర్‌, చిత్రనిర్మాత ఆల్బర్ట్ ఎస్ రడ్డీ (94) కన్నుమూశారు. అనారోగ్యంతో లాస్‌ఎంజిల్స్‌లోని ఆస్పత్రిలో చేరిన ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విష‌యాన్ని ఆల్డ‌ర్డ్ కుటుంబ స‌భ్యులు ధృవీక‌రించారు. ఆల్బ‌ర్ట్ తెరకెక్కించిన ` ది గాడ్ ఫాద‌ర్`, `మిలియ‌న్ డాల‌ర్ బేబి` లాంటి చిత్రాల‌కు ఆస్కార్ లు వ‌రించాయి. ఆల్బ‌ర్ట్ సిటీకామ్ హోగ‌న్ హీరోస్, డ్రామా వాక‌ర్, టెక్సాస్ రేంజ‌ర్, ది లాంగెస్ట్ యార్డ్ లాంటి సిరీస్ ల‌తో ద‌ర్శ‌కుడిగా ప్ర‌త్యేక‌మైన గుర్తింపును..ఇమేన్ ని ద‌క్కించుకున్నారు.

1994 లో బ్యాడ్ గ‌ర్ల్ చిత్రాన్ని కూడా నిర్మించారు. మ‌హిళా ప్రాధాన్య‌త పాత్ర‌ల‌తో మొద‌టి పాశ్చాత్య చిత్రంగా నిలిచింది `బ్యాడ్ గ‌ర్ల్. అటు పై `బేస్ బాల్ కామెడీ` (1994), `మ‌టిల్డా` (1978) లాంటి కామెడీ ఓరియేంటెడ్ చిత్రాల్ని కూడా నిర్మించారు. వీట‌తో పాటు `డెత్ హంట్`, `మెగాఫోర్స్`, `లాస్పిట‌ర్`, ` లేడీ బ‌గ్స్`, `ప్రిజ‌న‌ర్స్`, `మీన్ మెషిన్`, `కామిల్లె` చిత్రాల‌కు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు.

ఆల్బ‌ర్స్ట్ మృతి నేప‌థ్యంలో చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఆయ‌న అందించిన సేవ‌ల్ని సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులంతా కొనియాడుతున్నారు. `అల్ నిజంగా గొప్ప హాలీవుడ్ మావెరిక్స్‌లో ఒకరు` అని ఫ్లెచర్ పేర్కొన్నారు. `ఈనాటికీ ప్రభావితం చేసే, స్ఫూర్తినిచ్చే గొప్ప చిత్రాలను రూపొందించిన వారిలో ర‌డ్డీ ఒక‌రు. ప‌రిశ్ర‌మ‌లో ఆయ‌న ఎన్నో గొప్ప సినిమాలు తీసారు. ఎదిగే ద‌శ‌లో ఉన్న‌స‌వాళ్ల‌ను ఎదుర్కున్నారు. ప‌రిశ్ర‌మ‌లో ఆయ‌న‌ది ఎంతో గొప్ప ప్ర‌యాణం. అతని దృఢ సంకల్పం ఎంతో మందికి ఆద‌ర్శంగా నిలిచింది` అని అన్నారు.

అలాగే న‌టుడు టెల్లర్ ఇలా పేర్కొన్నారు. `ఆఫర్‌లో అల్ పాత్రను పోషించడం ఒక గౌరవం గా భావిస్తున్నాను. అది ఎంతో ప్ర‌త్యేక‌మైన పాత్ర‌. చాలా మంది న‌టుల్ని ప‌రిశీలించి నాకు అవ‌కాశం క‌ల్పించారు. అది నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. అల్ వ్య‌క్తిగ‌తంగా చాలా మంచి జీవితాన్ని గ‌డిపారు. క‌ల‌లు క‌ని వాటిని సాకారం చేసేందుకు నిరంత‌ర‌కం కృషి చేయాల‌ని యువ‌త‌కి ఎన్నో సంద‌ర్భాల్లో పిలుపుని`చ్చారు.