Begin typing your search above and press return to search.

బోయ్‌ఫ్రెండ్‌తో చెల‌రేగిపోయిన దిశా

'లోఫ‌ర్' చిత్రంతో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైంది దిశాప‌టానీ. ఇప్పుడు ప్ర‌భాస్ 'క‌ల్కి' చిత్రంలో ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టిస్తోంది

By:  Tupaki Desk   |   3 May 2024 4:18 AM GMT
బోయ్‌ఫ్రెండ్‌తో చెల‌రేగిపోయిన దిశా
X

'లోఫ‌ర్' చిత్రంతో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైంది దిశాప‌టానీ. ఇప్పుడు ప్ర‌భాస్ 'క‌ల్కి' చిత్రంలో ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టిస్తోంది. స్పెష‌ల్ నంబ‌ర్ తోను అల‌రించ‌నుంది. బాలీవుడ్ అగ్ర హీరోలంద‌రి స‌ర‌స‌నా న‌టించిన దిశా ప‌టానీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాతో సౌత్ లోను వేవ్స్ క్రియేట్ చేయ‌బోతోంది. ప్ర‌భాస్‌తో దిశా స్నేహానికి సంబంధించిన ఫోటోలు ఇంత‌కుముందు విడుద‌ల‌య్యాయి. ఆ ఇద్ద‌రూ స్నేహంగా క‌లిసిపోయిన స‌న్నిహిత ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.

అయితే దిశా పటానీ వృత్తిగ‌త జీవితం కంటే వ్య‌క్తిగ‌త జీవితం ఇటీవ‌ల‌ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. లాంగ్ టైమ్ బోయ్ ఫ్రెండ్ టైగ‌ర్ ష్రాఫ్ నుంచి విడిపోయాక, దిశా ప‌టానీ త‌న వృక్తిగ‌త ఫిట్ నెస్ శిక్ష‌కుడు అలెక్స్ ఇలిక్ తో స‌న్నిహితంగా ఉంటోంద‌ని ముంబై మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి. ప‌లుమార్లు ఈ ఇద్దరూ సెల్ఫీలతో స‌న్నిహితంగా ఉన్న ఫోటోలు ఇంట‌ర్నెట్ ని షేక్ చేసాయి. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా కెమిస్ట్రీ చూశాక అంద‌మైన జంట! అంటూ అభిమానులు కితాబిచ్చారు. అంతేకాదు మాజీ బోయ్ ఫ్రెండ్ టైగ‌ర్ ష్రాఫ్ తో దిశా ఇప్ప‌టికీ స్నేహంగా ఉంది.

ఇప్పుడు మ‌రోసారి అలెక్స్ ఇలిక్ తో స‌న్నిహితంగా ఉన్న మరో ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది. దిశా ఎప్ప‌టిలానే టోన్డ్ ఫిజిక్ తో బ్యాక్‌లెస్ దుస్తుల్లో అందంగా క‌నిపించింది. అత‌డితో సెల్ఫీ దిగుతూ ఎంతో స‌న్నిహితంగా క‌నిపించింది. అలెక్స్ - దిశా జంట ఒక‌రికొక‌రు ఎదురుప‌డితే ఆ స‌న్నివేశం ఊహించ‌లేనిదిగా ఉంది అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా దిశా అభిమానులు కామెంట్ల‌తో చెల‌రేగిపోతున్నారు.

ఈ జంట ఇటీవల ముంబైలో డిన్నర్ డేట్‌ను ఎంజాయ్ చేసారు. డేట్ నుండి ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి. వీటిపై ఫ్యాన్స్ విరుచుకుప‌డుతున్నారు. ఈ డేట్ నైట్ లో దిశా యానిమల్ ప్రింట్ డ్రెస్‌లో అద్భుతంగా కనిపించింది. అయితే అలెక్స్ తెల్లటి చొక్కా, నీలిరంగు డెనిమ్ లో క‌నిపించాడు. అంద‌మైన జంట నైట్ సెల‌బ్రేష‌న్ ఎప్ప‌టికీ వారికి మ‌ర‌పురానిది.