అతడు ఆమె గొడవల్లో మూడో వ్యక్తి?
యువ క్రికెటర్ హార్థిక్ పాండ్యా - నటాషా స్టాంకోవిక్ జంట నడుమ ఏం జరుగుతోంది? ఆ ఇద్దరూ విడిపోతున్నారా? కలిసే ఉన్నారా?
By: Tupaki Desk | 4 Jun 2024 4:00 AM GMTయువ క్రికెటర్ హార్థిక్ పాండ్యా - నటాషా స్టాంకోవిక్ జంట నడుమ ఏం జరుగుతోంది? ఆ ఇద్దరూ విడిపోతున్నారా? కలిసే ఉన్నారా? ఈ ప్రశ్నలకు జవాబు అస్పష్ఠంగా ఉంది. నిజానికి సోషల్ మీడియా సెలబ్రిటీ కపుల్ కాపురంలో నిప్పులు పోస్తోందని అంగీకరించాలి. గత కొంతకాలంగా నటాషా స్టాంకోవిక్ హార్థిక్ ఫోటోలను తన ఇన్ స్టా నుంచి తొలగించడం వల్లనే వారు విడిపోయారనే పుకార్ మొదలైంది. నటాషా పేరు నుంచి పాండ్య అనే ఇంటి పేరును తొలగించిందని, ఆ తర్వాత ఐపీఎల్ స్టాండ్స్ లో నటాషా కనిపించలేదని, ఆమె పుట్టినరోజుకు హార్థిక్ విషెస్ చెప్పలేదని అందుకే విడిపోయారని చాలా రకాలుగా ప్రచారమైంది.
అయితే సోషల్ మీడియా పుకార్లను అందిపుచ్చుకుని బాంబే టైమ్స్ కూడా హార్దిక్ -నటాసా వారి వైవాహిక జీవితంలో దాదాపు ఆరు నెలలుగా సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. గత ఆరు నెలలుగా వారి వివాహంలో టెన్షన్ నెలకొంది. ఈ జంట విడిపోయే అవకాశం ఉంది. అయితే భరణం శాతం చుట్టూ కథలు ఊహాజనితమైనవి.. ఇది PR ప్రచారంలా అవాస్తవంగా అనిపించింది! అని ఒక మూలం బాంబే టైమ్స్కి తెలిపినట్టు కథనం వెలువరించింది.
అయితే ఈరోజు ప్రారంభంలో నటాసా తన వివాహ ఫోటోలను అన్ఆర్కైవ్ చేసింది. తనకు హార్దిక్ పాండ్యాకు మధ్య అంతా బాగానే ఉందని సూచించింది. అంతే కాదు హార్థిక్ టి20 ప్రపంచకప్ మ్యాచ్ లకు వెళ్లే ముందు తన భార్య నటాషాతో చిన్నపాటి విహార యాత్రకు వెళ్లాడని కూడా కథనాలొచ్చాయి. రకరకాల పుకార్ల నడుమ ఇప్పుడు ఆ ఇద్దరి నడుమా ఒక యువకుడి ప్రమేయం కూడా ఉందని గుసగుసలు వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజం ఎంతో తెలీదు కానీ.. ప్రస్తుతం దిశా పటానీతో అత్యంత సన్నిహితంగా కనిపిస్తున్న అలెక్స్ ఇలిక్.. నటాషా స్టాంకోవిక్తోను సన్నిహితంగా ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వీటిని వైరల్ చేస్తూ .. హార్థిక్ కాపురంలో అతడే నిప్పులు పోశాడంటూ నెటిజనులు దూషణలకు దిగుతున్నారు. అయితే వీటిపై అలెక్స్ ఇలిక్ స్పందించాడు. నేను నాశనం చేశానని ఎవరు చెప్పారు? అని అతడు ప్రశ్నించాడు. తనను ఆడిపోసుకోవడం సరికాదని ఈ ప్రచారంలో నిజం లేదని ఖండించాడు.