Begin typing your search above and press return to search.

జిగ్రాలో ఆలియా సూపర్.. కానీ...

అయితే రిలీజ్ కు ముందు టీజర్, ట్రైలర్.. ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొల్పాయి.

By:  Tupaki Desk   |   13 Oct 2024 12:30 PM GMT
జిగ్రాలో ఆలియా సూపర్.. కానీ...
X

ఆర్ఆర్ఆర్ తో టాలీవుడ్ సినీ ప్రియులకు బాగా చేరువైన బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్.. రీసెంట్ గా జిగ్రా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆలియా నటించడమే కాకుండా.. సినిమా నిర్మాణంలోనూ భాగస్వామిగా మారారు. వాసన్ బాల దర్శకత్వం వహించిన ఆ సినిమా.. దసరా కానుకగా అక్టోబర్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో కూడా మేకర్స్.. గ్రాండ్ గా విడుదల చేశారు.

అయితే రిలీజ్ కు ముందు టీజర్, ట్రైలర్.. ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొల్పాయి. తెలుగులో కూడా బజ్ క్రియేట్ అయ్యేలా చేశారు మేకర్స్. ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. స్టార్ హీరోయిన్ సమంత, హీరో రానా, దర్శకుడు త్రివిక్రమ్ ను ఇన్వైట్ చేశారు. వారంతా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూ.. సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. దసరాకు తెలుగులో పలు సినిమాలు రిలీజ్ అవుతున్నా.. కంటెంట్ పై నమ్మకంతో విడుదల చేశారు మేకర్స్.

కానీ రిలీజ్ అయ్యాక సినీ రివర్స్ అయింది. అనుకున్న స్థాయిలో సినిమా మెప్పించలేకపోయింది. ఏదైనా స్టోరీ బాగుండి.. అందుకు క్యాస్టింగ్ యాక్టింగ్ తోడైతేనే.. సినీ ప్రియులు ఆస్వాదిస్తారు. జిగ్రాలో ఆలియా యాక్టింగ్ పరంగా అదరగొట్టినా.. స్టోరీలో కొత్తదనం లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్ గా మారింది. పాత కాన్సెప్ట్ తీసుకున్నా.. స్క్రీన్‌ ప్లేను కరెక్ట్ గా డైరెక్టర్ రాసుకోలేదని చెప్పాలి. దాదాపు సినిమా అంతా రొటీన్ గానే అనిపిస్తుంది.

అక్కాతమ్ముళ్ల మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ను సరిగ్గా చూపించలేదు. అయితే తమ్ముడిని కాపాడేందుకు అక్క చేసే ప్రయత్నాలన్నీ సాదాసీదాగా ఉంటాయి. భాటియా (మనోజ్‌ పవా) కుమారుడు, ముత్తు (రాహుల్‌ రవీంద్రన్‌)కు కావాల్సిన వ్యక్తి కూడా జైలు జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వారంతా తమ వాళ్లను జైలు నుంచి విడిపించుకునేందుకు ప్లాన్లు వేస్తారు. వాటిని చూస్తే అంత ఈజీగా బయటకు తీసుకురావచ్చా అనే అనుమానం వస్తుంది.

అదే సమయంలో జిగ్రా మూవీ లెంగ్త్ బాగా ఎక్కువైంది. అది కూడా ఒక మైనసే. ఓవరాల్ గా టెక్నికల్ గా సినిమా పర్లేదు. రైటింగ్ బాగుంటే మంచి రెస్పాన్స్ వచ్చేది. కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినా.. కథనంలో లోపాలు ఉండటం వల్ల వృధా అయిపోయినట్లే. ఏదేమైనా ఆలియా మాత్రం అదరగొట్టారు. యాక్షన్ సీక్వెన్సుల్లో దుమ్ము దులిపేశారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. ఆలియాను మాత్రం మెచ్చుకోవాల్సిందే.