Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ వీపు సొగ‌సు చూడ‌త‌ర‌మా?

బాలీవుడ్ స్టార్లు క్రిస్మ‌స్ ఈవెంట్ల నుంచి వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తుంటే అవి ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి.

By:  Tupaki Desk   |   27 Dec 2024 12:30 AM GMT
స్టార్ హీరోయిన్ వీపు సొగ‌సు చూడ‌త‌ర‌మా?
X

బాలీవుడ్ స్టార్లు క్రిస్మ‌స్ ఈవెంట్ల నుంచి వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తుంటే అవి ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి. వీటిలో చాలామంది కుటుంబ స‌భ్యులు, బంధుమిత్రుల‌తో క‌లిసి పండుగ‌ను సెల‌బ్రేట్ చేసుకుంటున్న ఫోటోలు ఆక‌ర్షించాయి. ఆలియా కూడా త‌న కుటుంబ స‌భ్యుల‌తో క్రిస్మ‌స్ వేడుక‌ల్ని ఘ‌నంగా జ‌రుపుకున్నారు. అందుకు సంబంధించిన గ్రూప్ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి.

ఇంత‌లోనే క్రిస్మ‌స్ వేడుక‌ల నుంచి ఓ స్పెష‌ల్ ఫోటోషూట్ ని కూడా ఆలియా షేర్ చేసింది. ఈ వేడుక‌ల కోసం ఎంతో ఉత్సాహంగా రెడీ అయిన‌ ఆలియా ఇదిగో ఇలా వీపందం ప్ర‌ద‌ర్శిస్తోంది. డార్క్ రెడ్ ఫ్రాకులో చాలా సింపుల్ గా క‌నిపిస్తున్న ఆలియా ఫ్యాష‌న్ సాధార‌ణ యువ‌తుల‌ను కూడా ఎక్కువ‌గా ఆక‌ర్షిస్తోంద‌ని చెప్పాలి. పండ‌గ‌ల వేళ ఆర్భాటం లేకుండా ఎలా సింపుల్ గా ఉండాలో ఆలియా లుక్ నేర్పిస్తోంద‌ని ప్ర‌శంసిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆలియా లుక్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. ఇటీవ‌ల కుమార్తె రాహా క‌పూర్ ని విడిచి ఆలియా క్ష‌ణ‌మైనా గ‌డ‌ప‌టం లేదు. క్రిస్మ‌స్ పార్టీలో గ్రూప్ ఫోటోలోను కూతురు రాహాతో పాటు క‌నిపించింది.

కపూర్ ఫ్యామిలీ ఈసారి ర‌ణ‌బీర్- ఆలియా జంట నిర్మించుకున్న కొత్త మాన్ష‌న్ లో క్రిస్మ‌స్ వేడుక‌ల్ని జ‌రుపుకున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. కొంతకాలం క్రితం అలియా భట్ - రణబీర్ కపూర్ తమ కుమార్తె రాహాతో కపూర్ మాన్షన్ కి వెళ్లారు. ఇప్పుడు అదే మాన్ష‌న్ లో పార్టీ వైభ‌వంగా జ‌రిగింది. క్రిస్మ‌స్ ఈవ్ లో ర‌ణ‌బీర్ కపూర్ శాంతా క్లాజ్‌గా మారాడు. ఆలియా , రాహా వేడుక‌లో ప్ర‌త్యేకంగా క‌నిపించారు. ఈ పార్టీలో అగస్త్య నంద, నవ్య నవేలి నంద కూడా కపూర్ కుటుంబంతో సరదాగా గడుపుతూ క‌నిపించారు. కపూర్ కుటుంబంతో అగస్త్య నంద, నవ్య నవేలి నందలను చూసి అభిమానులు కూడా షాక్ అయ్యారు. కపూర్ కుటుంబం ఫోటోలో కరీనా కపూర్, కరిష్మా కపూర్, సైఫ్ అలీ ఖాన్ కుటుంబాలు కనిపించలేదు. క్రిస్మస్ రోజున లోలో, బెబో ఎక్కడ అని కూడా ఆరాలు తీసారు. ఫ్యామిలీ ఫోటోలో ర‌ణ‌బీర్ త‌ల్లి గారైన నీతూ క‌పూర్ ఉన్నారు. ఇటీవ‌ల రాజ్ క‌పూర్ శ‌త‌జ‌యంతి వేడుక‌ల త‌ర్వాత ఆలియా పాల్గొన్న బిగ్గెస్ట్ ఈవెంట్ ఇది.