టాలీవుడ్ లో అమెకి ఉన్న క్రేజ్ జాన్వీ కి లేదా!
`ఆర్ ఆర్ ఆర్` సీతమ్మ పాత్ర సీతారామరాజు పాత్రకు జోడీ అయిన సంగతి తెలిసిందే. ఇలా ఒక్క సినిమా అలియా భట్ కి తెలుగులో ఎంతో పేరు తీసుకొచ్చింది.
By: Tupaki Desk | 1 Dec 2024 7:30 PM GMT`ఆర్ ఆర్ ఆర్` చిత్రంతో అలియాభట్ తెలుంగింట ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. చేసింది ఒక్క సినిమా అయినా ఎనలేని గుర్తింపు దక్కింది. సీతమ్మ పాత్రలో అలిభయట్ ఆహార్యం, నటన ప్రతీది ఆమెకు ప్రత్యేకమై గుర్తింపును తీసుకొచ్చింది. ఆ సినిమా సెట్స్ లో ఉండగానే అమ్మడికి ఎన్నో తెలుగు అవకాశాలొచ్చాయి. `దేవర`లో ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ ముందుగా అలియాభట్ కే వచ్చింది. ఆర్సీ 16 లో రామ్ చరణ్ కి జోడీగా అలియా అయితే బాగుంటుందని బుచ్చిబాబు భావించాడు.
`ఆర్ ఆర్ ఆర్` సీతమ్మ పాత్ర సీతారామరాజు పాత్రకు జోడీ అయిన సంగతి తెలిసిందే. ఇలా ఒక్క సినిమా అలియా భట్ కి తెలుగులో ఎంతో పేరు తీసుకొచ్చింది. ఇప్పటికీ అలియాభట్ తో సినిమాలు చేయాలని ఎంతో మంది దర్శక, నిర్మాతలు క్యూలో ఉన్నారు. కానీ అమ్మడు మాతృ భాషకే ప్రాధాన్యత ఇచ్చి ముందుకెళ్తుంది. అలియాభట్ లాగే టాలీవుడ్ కి అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ `దేవర`తో ఎంట్రీ ఇచ్చింది.
అమ్మడు లాంచ్ అవ్వడానికి మందు విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. కానీ `దేవర` రిలీజ్ తర్వాత అంతా తుస్సు మంది. అందులో జాన్వీ పాత్ర తక్కువగా ఉండటం ఒక కారణమైతే? ఆ పాత్ర ఏమాత్రం కనెక్ట్ కాలేదు?అన్నది ప్రధాన విమర్శ. యాక్టింగ్ లో ఈజ్ లేదు. నటనలో చలాకీ తనం కనిపించలేదు. బ్యూటీ విషయంలోనూ విమర్శలొచ్చాయి. ఆన్ స్క్రీన్ జాన్వీ వేరు..ఆప్ ది స్క్రీన్ జాన్వీ వేరు అనే వ్యత్యాసంపై రకరకాల డిడేట్లు నడిచాయి.
మొత్తంగా `దేవర` విషయంలో జాన్వీ అలియాస్ తంగ సరితూగలేదు అన్నది మెజార్టీ వర్గం విమర్శ. అలియాభట్ తో దేవర ఇమేజ్ ని కంపారిజన్ చేస్తే? అలియాట్ ముందు వరుసలో కనిపిస్తుంది. మునుపటి కంటే జాన్వీ గ్రాఫ్ పడిపోతుంది? అన్న విమర్శ కూడా వ్యక్తమవుతుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ ఆర్సీ 16లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.