Begin typing your search above and press return to search.

కూతురిని చూస్తూ ఎమోష‌న‌ల్ అయిన స్టార్ హీరోయిన్

బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్-అలియా భట్ ల గారాల‌ కూతురు రాహా కపూర్ ఈరోజుతో 2వ ఏట అడుగుపెట్టింది.

By:  Tupaki Desk   |   7 Nov 2024 6:02 AM GMT
కూతురిని చూస్తూ ఎమోష‌న‌ల్ అయిన స్టార్ హీరోయిన్
X

బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్-అలియా భట్ ల గారాల‌ కూతురు రాహా కపూర్ ఈరోజుతో 2వ ఏట అడుగుపెట్టింది. ఈ మ‌ర‌పురాని రోజున‌... అలియా ఇన్‌స్టాలో తన చిన్నారి రాహా గురించి రాస్తూ ఎంతో ఉద్వేగానికి లోన‌యింది.


``ఈరోజుకి 2 సంవత్సరాలు.. కొన్ని వారాల చిన్ని పాప‌గా ఉన్నప్పుడే నేను నీకు విష్ చేసాను!!! కానీ అది మ‌నం ఉన్న చోటు నుంచి పుట్టే ఉద్వేగం.. ఒకసారి తల్లితండ్రులైతే మీ బిడ్డ ఎప్పటికీ మీ బిడ్డగా ఉండాలని కోరుకుంటారు... పుట్టినరోజు శుభాకాంక్షలు..`` అని రాసారు. ప్ర‌తిరోజూ బ‌ర్త్ డే కేక్ తోనే అన్న‌ ఫీల్ క‌లిగించావ‌ని కూడా ఆలియా ఎమోష‌న‌ల్ అయింది. చిన్నారి రాహాతో క‌లిసి ఉన్న ఒక‌ త్రోబాక్ ఫోటోని కూడా ఆలియా షేర్ చేసింది. దీనిలో చిన్ని రాహాను తన చేతుల్లోకి తీసుకుంటున్న‌ప్పుడు ర‌ణ‌బీర్ త‌న‌నే ఆత్రుత‌గా చూస్తూ క‌నిపించాడు.

కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత రణబీర్ -అలియా జంట పెద్ద‌ల ఆశీస్సుల‌తో 14 ఏప్రిల్ 2022న పెళ్లితో ఒక‌ట‌య్యారు. రణబీర్ నివ‌శించే ముంబై ఇంట్లో సింపుల్ ఎఫైర్ గా ఈ పెళ్లి జ‌రిగింది. స్టార్ క‌పుల్ 6 నవంబర్ 2022న రాహాను స్వాగతించారు. ప‌లు ఇంటర్వ్యూలలో.. ఆలియా రాహాకు జన్మనిచ్చిన తర్వాత రాత్రిపూట తన జీవితం ఎలా మారిందో వివరించింది. ఆనందం బాధ ఉద్వేగం ఇలా అన్నిటినీ అనుభ‌వించాన‌ని తెలిపింది.