Begin typing your search above and press return to search.

దేవర జోరు కోసం హిందీలో ఆ ఇద్దరు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.

By:  Tupaki Desk   |   9 Sep 2024 1:30 PM GMT
దేవర జోరు కోసం హిందీలో ఆ ఇద్దరు
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ షురూ చేశారు. అందులో భాగంగా సెప్టెంబర్ 10న ముంబై వేదికగా దేవర ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారు. ట్రైలర్ రిలీజ్ ని పెద్ద ఈవెంట్ గా నిర్వహించబోతున్నారు. ఆర్ఆర్ఆర్ తో వచ్చిన క్రేజ్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకొని వెళ్లాలని తారక్ అనుకుంటున్నాడు.

అందుకే ముంబై నుంచి దేవర ప్రమోషన్స్ సందడి స్టార్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ పాల్గొననున్నారు. అలాగే చిత్ర యూనిట్ మొత్తం పార్టిసిపేట్ చేయనున్నారంట. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరుగుతాయని భావిస్తున్నారు. ఎన్టీఆర్ కెరియర్ లో ఆర్ఆర్ఆర్ తర్వాత సెకండ్ హైయెస్ట్ బడ్జెట్ మూవీగా దేవర తెరకెక్కుతోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూ కోసం బాలీవుడ్ స్టార్స్ ని రంగం లోకి దించుతున్నారంట. ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా నటించింది. ఈ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ తో అలియా భట్ కి మంచి బాండింగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో దేవర సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూ కోసం అలియా భట్ వస్తోందంట.

అలాగే బడా నిర్మాత కరణ్ జోహార్ కూడా దేవర మూవీ హిందీ ప్రమోషన్స్ ని దగ్గరుండి చూసుకుంటున్నారంట. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ తో పాటు దేవర ప్రమోషనల్ ఇంటర్వ్యూలో కరణ్ జోహార్, అలియా భట్ పాల్గొంటారంట. అలియా భట్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ని ఇంటర్వ్యూ చేస్తుందంట. కరణ్ జోహార్, అలియా భట్ కి బాలీవుడ్ లో క్రేజ్ ఉంది.

వీరిద్దరూ దేవర సినిమా ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేస్తే కచ్చితంగా అది హిందీ మార్కెట్ లో ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. అయితే ముందుగా దేవర ట్రైలర్ కచ్చితంగా బాలీవుడ్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి. అలా అయితే కరణ్, అలియా చేసే ప్రమోషన్స్ ప్లస్ అవుతాయి.

ఇప్పటి వరకు దేవర నుంచి వచ్చిన సాంగ్స్ అయితే హిందీలో కూడా మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ స్టార్ ఇమేజ్ కూడా దేవరకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. దేవర ట్రైలర్ రిలీజ్ కి ఇంకా ఒక్క రోజు మాత్రమే గడువు ఉంది. ఈ ట్రైలర్ కోసం తారక్ ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ తో ఎదురుచూస్తున్నారు.