అలియాభట్ కెరీర్ లో అతిపెద్ద డిజాస్టర్!
కొంతకాలంగా అలియాభట్ బాలీవుడ్ లో ఎదురు లేకుండా దూసుకుపోతుంది.
By: Tupaki Desk | 14 Oct 2024 10:07 AM GMTకొంతకాలంగా అలియాభట్ బాలీవుడ్ లో ఎదురు లేకుండా దూసుకుపోతుంది. వరుసగా విజయాలు అందుకుంటూ ఓ బ్రాండ్ బ్యూటీగా మారిపోయింది. `గంగుబాయి కతియవాడి` నుంచి ఎక్కడా ఎదురు లేదు. ఆర్ ఆర్ ఆర్, డార్లింగ్స్, బ్రహ్మాస్తపార్ట్-1, రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ ఇలా ఈ సినిమాలన్నీ భారీ ఓపెనింగ్స్ తో అదర గొట్టిన చిత్రాలే. లాంగ్ రన్ లో కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలు రానప్పటికీ విమర్శలైతే తెచ్చి పెట్టలేదు.
అయితే అలియాభట్ తాజా చిత్రం `జిగ్రా` బాక్సాఫీస్ వద్ద తుస్ మన్నట్లే కనిపిస్తోంది. అలియాభట్ కెరీర్ లో అతి పెద్ద ప్లాప్ చిత్రంగా కనిపిస్తుంది. ఆమె పదేళ్ల కెరీర్‌లో ఇదే అత్యల్ప బాక్సాఫీస్ కలెక్షన్ అని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు పేర్కొన్నారు. తొలి రోజు అంచనాలను అందుకోవడంలో విఫలమైన `జిగ్రా`. దసరా పండుగ సమయంలో కాస్త ఊపందుకుంది కానీ ఆ తర్వాత పడిపోయింది.
ఈ సినిమా నికర కలెక్షన్ రూ. తొలిరోజు 4.55 కోట్లు, రెండో రోజు 6.55 కోట్లు, మూడో రోజు 5.7 కోట్లు మాత్రమే. ఇప్పుడు పూర్తిగా థియేటర్ ఆక్యుపెన్సీ పడిపోయింది. ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన `విక్కీ విద్యా కా వో వాలా` మెరుగైన ఫలితం అందుకుంటుంది. మొదటి మూడు రోజుల్లో వరుసగా రూ. 5.5 కోట్లు, రూ. 6.9 కోట్లు , రూ. 6.4 కోట్లతో థియేటర్ ఆక్యుపెన్సీ ఎంతో మెరుగ్గా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో `జిగ్రా` పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ చిత్రాన్ని తెలుగులో సమంత, విక్రమ్ లాంటి వాళ్లు ప్రమోట్ చేసినా? అలియాభట్ పాట పాడటం, ప్రేక్షకులకు డాన్సు చేయడం వంటివి ఏమాత్రం లాభం లేకపోయింది. రజనీకాంత్ వెట్టేయాన్, దేవర లాంటి చిత్రాలు ఉండటంతో జిగ్రా ఇక్కడ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది.