Begin typing your search above and press return to search.

ఆ పాట నాకు చాలా స్పెషల్ అంటున్న ఆలియా..

ముఖేష్ బట్ నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరచుకున్న నటి ఆలియా భట్.

By:  Tupaki Desk   |   10 Oct 2024 1:05 PM GMT
ఆ పాట నాకు చాలా స్పెషల్ అంటున్న ఆలియా..
X

ముఖేష్ బట్ నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరచుకున్న నటి ఆలియా భట్. హిందీలోనే కాకుండా తెలుగులో కూడా ఆమెకు మంచి క్రేజ్ ఏర్పడింది. తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఆలియా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ క్రేజ్ మాత్రం చాలా హై రేంజ్ లో ఉంది.

వైవిధ్యమైన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ.. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ట్రెండు సృష్టిస్తుంది ఆలియా. తాజాగా ఆమె నటించిన ‘జిగ్రా’ చిత్రం ఈ వారం విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్లో ఆలియా చాలా బిజీగా ఉంది. ఈ మూవీ పాన్ ఇండియా చిత్రం కావడంతో తెలుగులో కూడా ఈ చిత్రానికి సంబంధించిన డబ్ వర్షన్ విడుదల కాబోతోంది.

ఈ చిత్రాని ‘ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ తెలుగులో విడుదల చేస్తోంది. అక్టోబర్ 11న భారీ రేంజ్ లో విడుదల కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్ కోసం అలియా భట్ హైదరాబాద్ వచ్చింది. ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి. గతంలో ఆమె నటించిన ‘బ్రహ్మాస్త్ర’ మూవీ కూడా తెలుగులో మాంచి కలెక్షన్స్ రాబట్టింది.

హైదరాబాద్‌లో జరిగిన ‘జిగ్రా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సమంత, రానా అతిధులుగా వచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలియా తన కూతురు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పరుచుకున్నారు.ఆర్ఆర్ఆర్ నుంచి ఆస్కార్ అవార్డు అందుకున్న ‘నాటు నాటు..’ పాట గురించి అలియా మాట్లాడింది. ఆ పాట అంటే తమ పాపకు ఎంతో ఇష్టమని పేర్కొన్న ఆలియా..ఆ పాట మా ఇంట్లో ఎప్పుడూ ప్లే చేస్తూ ఉంటాం అని అన్నారు.

ఇక రాహకు పాటలు వినడమే కాదు, డ్యాన్స్ చేయడం కూడా ఇష్టమే అని పేర్కొన్న ఆలియా.. రాహ ఎంతో ఇష్టంగా డ్యాన్స్ చేసే ‘నాటు నాటు..’ పాట తనకు ఎంతో ప్రత్యేకం అని పేర్కొంది. ప్రస్తుతం ఆలియా సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్ అండ్ వార్’ మూవీ లో నటిస్తోంది.