Begin typing your search above and press return to search.

అప్పటినుంచి ఎన్టీఆర్ ఆలోచన మారిందట..!

ఎన్టీఆర్ దేవర మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

By:  Tupaki Desk   |   24 Sep 2024 7:32 AM GMT
అప్పటినుంచి ఎన్టీఆర్ ఆలోచన మారిందట..!
X

ఎన్టీఆర్ దేవర మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించారు. పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తో కలిసి కరణ్ జోహార్ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. కరణ్ జోహార్ యాంకర్ గా వ్యవహరించిన ఈ స్పెషల్ చిట్ చాట్ లో అటు దేవర ఇటు అలియా భట్ జిగ్రా గురించి ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు.

ఎన్టీఆర్ ఒక గొప్ప యాక్టర్ కెమెరా ముందు తారక్ అదరగొట్టేస్తాడని అలియా భట్ చెప్పింది. RRR లో తమ సీన్ చేస్తున్న టైం లో చాలా సపోర్ట్ ఇచ్చారని అన్నది. అంతేకాదు ఆ సినిమా చేస్తున్న టైం లో మేము మంచి స్నేహితులుగా మారాం. బ్రహ్మాస్త్ర ఈవెంట్ చేశాక ఎన్టీఆర్ ఇంట్లోనే నైట్ డిన్నర్ చేశాం. ఆ టైం లోనే తాను ప్రెగ్నెన్సీ తో ఉన్నా అప్పుడే పుట్టే బిడ్డ పేరు గురించి కూడా చర్చించామని అన్నారు అలియా భట్.

దేవర సినిమా చూసేందుకు తాను ఆసక్తిగా ఉన్నానని అన్నారు అలియా భట్. ఇక దేవర గురిచి ఎన్టీఆర్ మరోసారి సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని చివరి 30 నిమిషాలు సినిమా నెక్స్ట్ లెవెల్ అని అన్నారు. దీనితో పాటు అలియా భట్ నటిస్తున్న జిగ్రా గురించి కూడా ఆమె చెప్పుకొచ్చారు. కరణ్ జోహార్ నిర్మించిన జిగ్రా సినిమాను వాసం బాల డైరెక్ట్ చేశారు. ఫారిన్ లో పోలీసులు అరెస్ట్ చేసిన సోదరుడిని సోదరి ఎలా కాపాడింది అనే కథతో జిగ్రా వస్తుంది.

తన వరకు ఈ స్టార్ డం, ఇమేజ్ అన్ని కాదు తాను చేయాల్సిన దాని గురించి ఆలోచిస్తానని అన్నారు తారక్. అభయ్ పుట్టినప్పుడు తండ్రిగా తన ఫీలింగ్ చెప్పలేనని. నేను ఏంటి అన్నది అప్పుడు అర్ధమైందని.. ఆ తర్వాత నుంచి సినిమాల సెలక్షన్ లో కూడా మార్పు వచ్చిందని అన్నారు తారక్.

జిగ్రా ట్రైలర్ గురించి తారక్ మాట్లాడుతూ ట్రైలర్ చూసి సినిమా బాగుంటుందని అనుకున్నానని అన్నారు. ఎన్టీఆర్, అలియాల మధ్య కామన్ ఫ్యాక్టర్ గురించి కరణ్ జోహార్ చెబుతూ ఇద్దరికి స్టూడెంట్ అనే పదం తోనే పాపులర్ అయ్యారని అన్నారు. తారక్ స్టూడెంట్ నెంబర్ 1 తో సక్సెస్ కొట్టగా.. అలియా భట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ తో తెరంగేట్రం చేసిందని చెప్పారు.

దేవర సినిమా చూసేందుకు తాను ఆసక్తిగా ఉన్నానని అలియా భట్ చెప్పగా జిగ్రా కూడా సక్సెస్ అందుకోవాలని తారక్ అన్నారు. దేవర సినిమా హిందీ లో కరణ్ జోహార్ రిలీజ్ చేస్తున్నారు. దేవర ఈ నెల 27న రిలీజ్ అవుతుండగా జిగ్రా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

దేవర తో అలియా భట్ జిగ్రా విషయాలను సంబదించిన స్పెషల్ ఇంటర్వ్యూ మీద మీరు ఒక లుక్కేయండి..