Begin typing your search above and press return to search.

భ‌వ‌నంలోకి వెళుతుంటే న‌టి వెంట ప‌డ్డారు!

ఫోటోగ్రాఫ‌ర్లు వెంబ‌డించ‌డం.. స్నాప్ లు క్లిక్ చేయ‌డం.. దానికి న‌వ్వూతూ పోజులివ్వ‌డం న‌టీమ‌ణుల‌కు ష‌రా మామూలు.

By:  Tupaki Desk   |   7 Sep 2024 3:30 PM GMT
భ‌వ‌నంలోకి వెళుతుంటే న‌టి వెంట ప‌డ్డారు!
X

ఫోటోగ్రాఫ‌ర్లు వెంబ‌డించ‌డం.. స్నాప్ లు క్లిక్ చేయ‌డం.. దానికి న‌వ్వూతూ పోజులివ్వ‌డం న‌టీమ‌ణుల‌కు ష‌రా మామూలు. ఆ స‌మ‌యంలో వారికి ఫోజులివ్వ‌డ‌మే కాదు.. అంద‌రి యోగ క్షేమాలు క‌నుక్కోవ‌డం వారితో స్నేహంగా మాట్లాడ‌టం స‌హ‌జంగా చూస్తుంటాం. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న కొత్త వీడియోలో ఆలియా అందుకు పూర్తి భిన్నంగా క‌నిపించింది. ఫోటోగ్రాఫ‌ర్ల‌పై చాలా కోపంగా ఉంది. ఆలియా ముంబైలోని తన బిల్డింగ్‌కు తిరిగి వస్తుండగా రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఫోటోగ్రాఫ‌ర్లు ఆలియాను విడిచిపెట్ట‌కుండా లోపలికి వెళ్లిపోయారు.

వీడియోలో అలియా భట్ తన భవంతిలోకి దూసుకువెళుతూ కనిపిస్తోంది. కొన్ని ఫోటోలకు పోజులిచ్చింది. కానీ ఆ త‌ర్వాత నడుచుకుంటూ వెళ్లిపోతుంటే.. ఫోటోగ్రాఫ‌ర్లు భవనంలోకి అనుసరించారు. ఆలియా టీమ్ భవనం ప్రైవేట్‌గా ఉందని లోనికి రావొద్ద‌ని మర్యాదపూర్వకంగా చెప్పారు. ఆలియా గోప్యతను గౌరవించాలని అభ్యర్థించారు. అయినప్పటికీ ఫోటోగ్రాఫర్‌లు ఆమె బృందం అభ్యర్థనను విస్మరించి త‌న‌ను అనుసరిస్తూనే ఉన్నారు. ఇది ఆలియాకు చికాకు పుట్టించింది. కోపంగా ఆలియా ఫోటోగ్రాఫ‌ర్ల‌ను ప్ర‌శ్నించింది. ఆప్ క్యా కర్ రహే హో? యే ప్రైవేట్ బిల్డింగ్ హై (మీరు ఏమి చేస్తున్నారు? ఇది ప్రైవేట్ భవనం) అని వ్యాఖ్యానించింది.

స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ల‌కు అలియా నిరాశను వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. 2023లో కొంద‌రు ఫోటోగ్రాఫర్‌లు ఆమె ఇంట్లో ఉన్నప్పుడు తన ఫోటోల‌ను క్లిక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు కూడా కలత చెందింది. త‌మాషా చేస్తున్నారా? మా ఇంట్లో ఉన్నాను, ఒక సాధారణ మధ్యాహ్నాన్ని గడుపుతున్నాను, నా గదిలో కూర్చున్నాను, నన్ను ఏదో చూస్తున్నట్లు అనిపించింది. నేను పైకి చూసాను..పొరుగువారి టెర్రస్‌పై ఇద్దరు వ్యక్తులు కనిపించారు... అంటూ చాలా సీరియ‌స్ అయింది. త‌న గోప్య‌త‌కు భంగం క‌లిగించార‌ని వారిపై కేసు ఫైల్ చేస్తాన‌ని హెచ్చ‌రించంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... ఆలియా భట్ తదుప‌రి జిగ్రాలో నటించింది. ఇది అక్టోబర్ 11 న విడుదల కానుంది. ఇటీవల ఆసక్తికరమైన పోస్టర్‌లతో అభిమానులను ఆటపట్టించింది. వాసన్ బాలా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వేదాంగ్ రైనా కూడా నటించారు. రేపు టీజర్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆలియా YRF మొదటి భారతీయ గూఢచారి చిత్రం ఆల్ఫాలో కూడా న‌టిస్తోంది. ఇందులో ముంజ్యా స్టార్ శర్వరితో కలిసి నటిస్తోంది.