పీడ కల వల్లే ఇన్‌స్టాలో పాప ఫోటోలు తొలగింపు..!
రహా ఫోటోలను ఇటీవల ఆలియా భట్ సోషల్ మీడియా ద్వారా తొలగించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో గతంలో షేర్ చేసిన ప్రతి ఒక్క ఫోటోను ఆలియా తొలగించడంతో ఏం జరిగింది అంటూ అంతా షాక్ అయ్యారు.
By: Tupaki Desk | 14 March 2025 7:00 PM ISTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆలియాను దాదాపుగా 8.7 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలతో పాటు ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఆలియా వివాహం రణబీర్ కపూర్‌తో 2022లో జరిగిన విషయం తెల్సిందే. వీరికి రహా అనే కూతురు ఉంది. రహా ఫోటోలు సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా వైరల్ అవుతూ ఉంటాయి. ఆలియా కూడా చాలా సార్లు తన కూతురు రహా ఫోటోలను షేర్ చేసింది. ఆలియా, రణబీర్ కపూర్, రహా ఉన్న ఫోటోలు ఎప్పుడూ వైరల్ కావడం మనం చూస్తూనే ఉంటాం.
రహా ఫోటోలను ఇటీవల ఆలియా భట్ సోషల్ మీడియా ద్వారా తొలగించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో గతంలో షేర్ చేసిన ప్రతి ఒక్క ఫోటోను ఆలియా తొలగించడంతో ఏం జరిగింది అంటూ అంతా షాక్ అయ్యారు. ఆలియా ను రెగ్యులర్గా సోషల్ మీడియా ద్వారా ఫాలో అయ్యే వారు ఈ విషయాన్ని గుర్తించారు. వెంటనే ఏం జరిగింది అంటూ సోషల్ మీడియా ద్వారా ఆమెను గట్టిగా ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఆలియా కూతురు ఫోటోలను తొలగించడం వెనుక కారణం ఏంటి అంటూ నలుగురు నాలుగు రకాలుగా ఊహించడం మొదలు పెట్టారు. చివరకు ఈ విషయం ఆలియా స్వయంగా స్పందించింది. రహా ఫోటోలను తొలగించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే విషయాన్ని క్లారిటీ ఇచ్చింది.
ఇటీవల ఆలియాకు ఒక పీడ కల వచ్చిందట. ఆ కలలో రహాను గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఎత్తుకు వెళ్లారని ఆలియా కల కన్నదట. రహాను దారుణంగా ఎత్తుకు వెళ్లినట్లు కల రావడంతో షాక్ అయ్యాను. అందుకే రహా విషయంలో మరింత జాగ్రత్తలు అవసరం అని నిర్ణయించుకున్నాను. అందుకే తన సెక్యూరిటీ పెంచాలనే ఉద్దేశంతో కొత్త నిర్ణయాలు తీసుకున్నాను. అందులో భాగంగానే సోషల్ మీడియాలో రహాకు సంబంధించిన ప్రతి ఫోటోను తొలగించాను. ఇంటర్నెట్‌లో తన ఫోటోలు లేకుండా చూడాలని నిర్ణయించుకున్నాను.
మేము మాత్రమే కాకుండా చాలా మంది రహా ఫోటోలను తమ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌ల్లో షేర్ చేశారు. వారందరికీ కూడా విజ్ఞప్తి చేసి ఆ ఫోటోలను తొలగించే ప్రయత్నాలు చేశామని ఆలియా చెప్పుకొచ్చింది. ఇది అంతా రహా యొక్క భద్రత కోసం అని ఆలియా చెప్పుకొచ్చింది. రణబీర్ కపూర్ సైతం తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ఉన్న రహా ఫోటోలను తొలగించినట్లు సమాచారం అందుతోంది. మొత్తానికి వీరిద్దరు తమ కూతురు భద్రత పట్ల చూపిస్తున్న జాగ్రత్త చూడముచ్చటగా ఉందని అంటున్నారు. ఇలాంటి పరిణామాలు ఎదురు అవుతాయనే ఉద్దేశంతో ముందు నుంచి కోహ్లీ పిల్లల ఫోటోలను షేర్ చేయడం లేదు, రామ్ చరణ్, ఉపాసనలు సైతం ఇప్పటి వరకు క్లింకార ఫోటోలను అధికారికంగా రివీల్ చేయలేదు. సెలబ్రెటీ పిల్లలకు మినిమం సెక్యూరిటీలో భాగంగా ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయక పోవడం మంచిది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.