Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: రాయ‌ల్ ప్రిన్సెస్ ఆలియా సొగ‌సు

ది ఛామింగ్ ప్రిన్సెస్ ఆలియాభ‌ట్.. అందంతో ఎక్స్‌ప్రెష‌న్స్ తో, ఎంపిక చేసుకున్న డిజైన‌ర్ లుక్ తో ఆలియా అంద‌రి క‌ళ్ల‌ను త‌న‌వైపు తిప్పేసుకుంది.

By:  Tupaki Desk   |   6 Feb 2025 4:30 AM GMT
ఫోటో స్టోరి: రాయ‌ల్ ప్రిన్సెస్ ఆలియా సొగ‌సు
X

చుట్టూ రాయ‌ల్ యాంబియెన్స్... అక్క‌డ ఓ అంద‌మైన యువ‌రాణి.. ఎవ‌రి కోస‌మో ఎదురు చూస్తోంది. రాజ ప్రాకారంలో రాకుమారి.. త‌న్మ‌యంగా.. ఆద మ‌ర‌పుగా.. మైమ‌రిపించేలా.. ఆ రూపం ముగ్ధ మ‌నోహ‌రం.. యాంబియెన్స్ కి త‌గ్గ‌ట్టే రాచ‌రికం ఉట్టిప‌డుతోంది. ఇంత‌కీ ఎవ‌రీ బ్యూటీ? అంటే ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు.


ది ఛామింగ్ ప్రిన్సెస్ ఆలియాభ‌ట్.. అందంతో ఎక్స్‌ప్రెష‌న్స్ తో, ఎంపిక చేసుకున్న డిజైన‌ర్ లుక్ తో ఆలియా అంద‌రి క‌ళ్ల‌ను త‌న‌వైపు తిప్పేసుకుంది. కెరీర్‌లో ఎన్నో విల‌క్ష‌ణ‌మైన రూపాల్లో క‌నిపించినా ఇది నిజంగా యూనిక్ లుక్ అని ప్ర‌శంసించి తీరాలి.


ఒక కార్పొరెట్ ప్ర‌క‌ట‌న‌ కోసం తాజా ఫోటోషూట్ లో అలియా భట్ ఇలా మెస్మ‌రైజ్ చేసింది. 31 ఏళ్ల ఆలియా అందం చందం అపురూప‌మైన ఎక్స్‌ప్రెష‌న్ ప్ర‌తిదీ ఎంతో ఆక‌ట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఫోటోషూట్ కోసం ఎంపిక చేసుకున్న నేప‌థ్యం రాయ‌ల్ లుక్, డిగ్నిటీ, భారీత‌నం ఆక‌ర్షిస్తున్నాయి. డిస్నీ యువరాణి సొగసు ఇది అంటూ అభిమానులు ఆలియాను చూసి మురిసిపోతున్నారు.


మెరిసే గోల్డ్ క‌ల‌ర్ గౌన్.., థై స్లిట్ ఫ్రాక్‌.., భారీ లెహంగా... ఇలా ర‌క‌ర‌కాల డిజైన‌ర్ దుస్తుల్లో ఆలియాపై ఈ ప్ర‌త్యేక‌ ఫోటోషూట్ ని చేసారు. ప్ర‌తి లుక్ దేనిక‌దే ప్ర‌త్యేకం. సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైన‌ర్ రియా కపూర్ ఆలియాకు స్టైలింగ్ చేసారు. రియా ప్ర‌ముఖ క‌థానాయిక‌ సోన‌మ్ క‌పూర్ సోద‌రి, అగ్ర హీరో అనీల్ క‌పూర్ కుమార్తె అన్న సంగ‌తి తెలిసిందే. అబు జానీ సందీప్ ఖోస్లా కస్టమ్-డిజైన్ నుంచి బంగారు గౌనును ఈ ఫోటోషూట్ కోసం ఆలియా ధ‌రించింది. ఈ డిజైన‌ర్ దుస్తుల్లో జరీ ఎంబ్రాయిడరీ, షిమ్మ‌రీ మెర‌పులు.. సీక్విన్ అలంకరణలు ప్ర‌తిదీ డ్ర‌మ‌టిక్ గా ఆక‌ర్షిస్తున్నాయి.

ఆలియా డిజైన‌ర్ లుక్స్ ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి. అభిమానులు `దేశీ సిండ్రెల్లా` అని ప్రశంసలు కురిపిస్తున్నారు. యువ‌రాణి అంటూ కొంద‌రు కీర్తిస్తున్నారు. ఆలియా త‌దుప‌రి ఆల్ఫా, ల‌వ్ అండ్ వార్ చిత్రాల్లో న‌టిస్తోంది. ఆల్ఫా లో గూఢ‌చారి పాత్ర‌తో స్ట‌న్ చేయ‌బోతోంది.