పిక్‌టాక్ : అందాల సీతాకొక చిలుక
బజార్ ఇండియా సోషల్ మీడియా పేజీలో ఈ ఫోటోలను షేర్ చేయడం ద్వారా వైరల్ అయ్యాయి.
By: Tupaki Desk | 15 March 2025 6:00 PM ISTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ హీరోయిన్‌గా ఎంత బిజీగా ఉన్నా, ఫ్యామిలీతో ఎంత ఎక్కువ సమయం కేటాయిస్తున్నా సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్ చేయడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ మ్యాగజైన్‌లపై కవర్ ఫేజీల కోసం ఫోటో షూట్స్ ఇస్తూనే ఉంటుంది. తాజాగా బజార్ ఇండియా కోసం ఆలియా భట్ సీతాకొక చిలుక రూపంలో కనిపించింది. అందమైన సీతాకొక చిలుక మాదిరిగా ఫోటోలకు ఫోజ్ ఇవ్వడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బజార్ ఇండియా సోషల్ మీడియా పేజీలో ఈ ఫోటోలను షేర్ చేయడం ద్వారా వైరల్ అయ్యాయి.
ఆలియాను ఆమె అభిమానులతో పాటు ఎక్కువ శాతం మంది బ్రెయిన్ విత్ బ్యూటీ అంటూ ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. అందుకే ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పుడు వచ్చినా వైరల్ కావడం మనం చూస్తూ ఉంటాం. తాజాగా మరోసారి ఈమె తన అందమైన ఫోటోలతో వైరల్ అవుతోంది. విభిన్నమైన లుక్, సింపుల్ హెయిర్ స్టైల్‌తో ఆలియా భట్ మతి పోగొట్టింది. ఆకట్టుకునే అందంతో పాటు, తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్‌డం దక్కించుకున్న ప్రతిభ ఈమె సొంతం అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈమె సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసిన వెంటనే వైరల్ కావడం మనం చూస్తూ ఉంటాం.
బాలీవుడ్ సినిమాల్లోనే కాకుండా సౌత్ సినీ ప్రేక్షకులకు కూడా ఈమె సుపరిచితురాలు అనే విషయం తెల్సిందే. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోయిన్‌గా ఈమె నటించింది. రామ్ చరణ్ కు జోడీగా నటించిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఆ సినిమాలో ఆలియా పాత్ర ఇంకాస్త ఎక్కువ ఉంటే బాగుండేది అనేది కొందరి అభిప్రాయం. ఆ సినిమా తర్వాత టాలీవుడ్ నుంచి భారీ పారితోషికంతో పలు ఆఫర్లు వచ్చినా ఆలియా తిరస్కరించిందనే వార్తలు సోషల్ మీడియాతో పాటు, ఇండస్ట్రీ వర్గాల్లోనూ ప్రచారం జరిగాయి.
ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తున్న ఆలియా భట్ ఒక బిడ్డకు తల్లి అయిన ఏ మాత్రం అందం తగ్గకుండా అంతకు మించి అన్నట్లుగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందమైన ఆలియా భట్ ఫోటోలు ఎప్పటిలాగే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆలియా భట్ హాలీవుడ్‌లో బిజీ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్స్ జాబితాలో ఆలియా ముందు ఉంటుంది అనే విషయం తెల్సిందే. నటిగానే కాకుండా ఇలా కవర్ పేజీలపై తన అందంతో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ సందడి చేస్తోంది.