తెల్ల గులాబీ.. మల్లె సొగసు.. ఆలియా స్టన్నింగ్!
ప్రధాని మోదీ సహా చాలామంది ప్రముఖులను ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కపూర్ కుటుంబం ఆహ్వానించింది.
By: Tupaki Desk | 14 Dec 2024 7:30 PM GMTఓవైపు 'గ్రేటెస్ట్ షోమ్యాన్ ఆఫ్ ఇండియన్ సినిమా' రాజ్ కపూర్ 100వ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని కపూర్ కుటుంబం ఘనంగా సెలబ్రేషన్స్ నిర్వహిస్తోంది. ప్రధాని మోదీ సహా చాలామంది ప్రముఖులను ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కపూర్ కుటుంబం ఆహ్వానించింది. అట్టహాసంగా మొదలైన ఈ వేడుకలో టాప్ సెలబ్రిటీలు పాల్గొన్నారు.
అయితే కోట్లాది మంది వీక్షించే ఈ ఈవెంట్ లో అలియా భట్ కొత్త రూపంతో తళుకులీనింది. తెల్లటి చీర ధరించిన ఆలియా చేతిలోకి తెల్ల గులాబీ అందుకుని సిగ్గులమొగ్గవుతూ కెమెరాలకు ఫోజులిచ్చింది. ఆలియా అరవిరిసిన తెల్ల గులాబీలా అందంగా ఉందంటూ ప్రశంసిస్తున్నారు. మల్లెపువ్వు చీరలో తెల్ల గులాబీ చిక్కుకుంది! అంటూ ఆలియా రూపానికి అద్భుతమైన కాంప్లిమెంట్లు ఇస్తున్నారు కొందరు. మొత్తానికి ఆలియా ఈ కొత్త లుక్ లో అందరి దృష్టిని ఆకర్షించింది.
రాజ్ కపూర్ 100వ పుట్టినరోజు వేడుకల రెడ్ కార్పెట్ ఈవెంట్‌లో అలియా భట్ డిజైనర్ లుక్ కి అద్భుతమైన స్పందనలు వచ్చాయి. చాలామంది బాలీవుడ్ భామలు దీనిపై స్పందించారు. ఆలియా సోదరి షాహీన్ భట్ ఆమె అందంగా కనిపించిందని పేర్కొనగా, భూమి పెడ్నేకర్ అద్భుతంగా కనిపించావ్ అంటూ ప్రశంసించారు. రియా కపూర్ కూడా ఈ ఫోటోలను 'లవ్లీ' అని ట్యాగ్ చేసింది. ఒక తెల్ల చీర - అలియా భట్! అజేయమైన అమ్మాయి అంటూ ఆలియా గంగూబాయి కతియావాడి సినిమాను ప్రమోట్ చేస్తున్న విధానాన్ని ఎవరో ఒక అభిమాని గుర్తు చేసుకున్నారు. గంగూభాయిగా నటనకు ఆలియా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే.
మొత్తం కపూర్ కుటుంబం ఈ కార్యక్రమానికి హాజరు కాగా, ఆలియా తల్లిదండ్రులు మహేష్ భట్ - సోనీ రజ్దాన్ కూడా వేడుకలో పాల్గొన్నారు. ఆలియా సోదరి షాహీన్ కూడా తన తల్లిదండ్రులతో కలిసి వేడుకకు విచ్చేసింది. ఈవెంట్ రణబీర్ కపూర్ తన మామగారైన మహేష్ భట్ ని వేడుకలో హగ్ చేసుకుని పలకరించడం కనిపించింది. వీరితో పాటు కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, కరిష్మా కపూర్, నీతూ కపూర్, రిద్ధిమా కపూర్ షానీ, రేఖ, విక్కీ కౌశల్, ఆదార్ జైన్, సంజయ్ లీలా భన్సాలీ, రితీష్ - జెనీలియా దేశ్‌ముఖ్, జాకీ భగ్నానీ, టైగర్ ష్రాఫ్, శర్వరి, హుమా ఖురేషీ, ఆదిత్య రాయ్ కపూర్, ఫర్హాన్ అక్తర్, ఆకాంక్ష మల్హోత్రా సహా చాలామంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.