బాలీవుడ్ జోడీ కుమార్తెకు పేరు పెట్టిన తారక్!
వీళ్లిద్దరు తారక్ కి మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. `ఆర్ ఆర్ ఆర్` సినిమాతో తారక్-అలియా కలిసి పనిచేయడంతో మంచి స్నేహితులయ్యారు.
By: Tupaki Desk | 26 Sep 2024 4:02 PM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ దంపతుల కుమార్తెకు పేరు పెట్టాడా? తారక్ సూచించిన పేరునే ఆ తల్లిదండ్రులు నామకరణం చేసారా? అంటే అవుననే తెలుస్తోంది. ఇంతకీ ఎవరా జోడీ? తారక్ తో అంత క్లోజ్‌గా మూవ్ అయిన వారు? ఎవరు అంటే?... రణబీర్ కపూర్-అలియాభట్ జంట. అవును. వీళ్లిద్దరు తారక్ కి మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. `ఆర్ ఆర్ ఆర్` సినిమాతో తారక్-అలియా కలిసి పనిచేయడంతో మంచి స్నేహితులయ్యారు.
ఎంతగా అంటే ఒకరి ఇంటికి ఒకరు లంచ్...డిన్నర్ కు వెళ్లేంతగా. బ్రహ్మాస్త్ర ప్రమోషన్ లో భాగంగా ఒక నైట్ అలియా-రణబీర్ జోడీ తారక్ ఇంట్లోనే స్పెండ్ చేసారు. ఆ సమయంలోనే బిడ్డకు ఎలాంటి పేరుపెట్టాలి? అనే చర్చ వాళ్ల మధ్య వచ్చిందిట. అప్పటికే అలియాభట్ కి నెలలు నిండే సమయం దగ్గర పడిందట. అబ్బాయి పుడితే ఏ పేరు పెట్టాలి? అమ్మాయి పుడితే ఏ పేరుపెట్టాలి? అని ముగ్గురి మధ్య సీరియస్ గా డిస్కషన్ వచ్చిందిట.
దీంతో తారక్ కు కుమార్తె పుడితే మాత్రం `రాహా` అనే పేరును సూచించారుట. తారక్ అనుకున్నట్లే అలియా-రణబీర్ కూడా అదే పేరు పెట్టారు. రాహా అచ్చంగా అమ్మకు అచ్చుగుద్దినట్లే ఉంటుంది. కళ్లు..చెవులు..ముక్కు అన్నీ అలియాకి చాలా దగ్గరగా ఉంటాయి. అలా రాహా అమ్మను పోలింది. ప్రస్తుతం ఆజోడీ ఎంతో సంతోషంగా ఉంది. వృత్తి..వ్యక్తిగత జీవితాల్లో బాలీవుడ్ కి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇక తారక్ కి ఇద్దరు కొడుకులే. ఓ కుమార్తె ఉంటే బాగుండని ఆశపడ్డాడు. కానీ నెర వేరలేదు. ఆడ పిల్లలంటే ఎన్టీఆర్ కి ఎంతో ఇష్టం. ఇంట్లో ఖాళీసమయాన్ని పిల్లలతోనే గడుపుతుంటాడు. ప్రస్తుతం అమెరికా టూర్ లో ఉన్నాడు. `దేవర` సినిమాని కుటుంబంతో కలిసి అమెరికాలో వీక్షించనున్నాడు. ఆసినిమా మరికొన్ని గంటల్లో రిలీజ్ కానుంది.